Share News

Fridge Usage Tips: ఫ్రిజ్‌ను అలా ఉంచితే కరెంట్ బిల్ ఎక్కువొస్తుంది తెలుసా..

ABN , Publish Date - Jun 02 , 2025 | 08:07 PM

మీ ఇంట్లో ఫ్రిజ్ సరిగా కూలింగ్ కావడం లేదా, దీంతోపాటు పవర్ బిల్ కూడా పెరుగుతుందా. దీనికి కారణం ఫ్రిజ్, గోడ మధ్య సరైన దూరం లేకపోవడమని నిపుణులు (Fridge Usage Tips) చెబుతున్నారు. అయితే ఇది నిజమేనా కాదా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Fridge Usage Tips: ఫ్రిజ్‌ను అలా ఉంచితే కరెంట్ బిల్ ఎక్కువొస్తుంది తెలుసా..
Fridge Usage Tips

మీ ఇంట్లో ఫ్రిజ్ (Fridge Usage Tips) సరిగా చల్లబడటం లేదా, అయినా కూడా కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుందా. దీనికి కారణం తెలిస్తే మాత్రం మీరు ఆశ్చర్యపోతారు. ఆ క్రమంలో మీరు ఫ్రిజ్‌ను గోడకు ఎంత దగ్గరగా ఉంచారో గమనించారా. దగ్గరగా ఉంటే మాత్రం మీకు పవర్ బిల్ మోత తప్పదు. ఇది నిజమని నిపుణులు చెబుతున్నారు. ఫ్రిజ్, గోడ మధ్య సరైన దూరం లేకపోతే, ఎయిర్ వెంటిలేషన్ అంతరాయం కలిగి, కూలింగ్ ప్రభావం తగ్గిపోతుందని అంటున్నారు. ఇది ఫ్రిజ్ లోపల గడ్డకట్టడం లేదా చల్లదనం తగ్గడానికి కారణమవుతుందని చెబుతున్నారు.


ఏ కాలంలో ఉంచాలి..

ఈ సమస్యను నివారించాలంటే, ఫ్రిజ్‌ను గోడకు సరైన దూరంలో ఉంచడం చాలా ముఖ్యం. అయితే గోడకు ఎంత దూరంలో ఉంచాలనే విషయాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం. వేసవి లేదా శీతాకాలం ఏ సమయం అయినా కూడా, మీ ఇంట్లో ఫ్రిజ్ 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది. అలాంటి ఫ్రిజ్ ఎక్కువసేపు ఎలాంటి సమస్య లేకుండా పనిచేయాలంటే మాత్రం కొన్ని చిన్న చిన్న విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. నిజానికి, చాలా మందికి ఇంట్లో ఫ్రిజ్ సరిగ్గా ఎక్కడ ఎంత దూరం ఉంచాలో కూడా తెలియదు. కొంత మంది ఫ్రిజ్‌ను గోడకు పూర్తిగా దగ్గరగా ఉంచుతారు. కానీ ఇది దానికి సరైన పద్దతి కాదని నిపుణులు అంటున్నారు.


ఎంత దూరం ఉండాలి

అధికారికంగా LG వెబ్‌సైట్‌లో దీని గురించి సమాచారం అందించారు. LG ప్రకారం, ఫ్రిజ్, గోడ మధ్య కనీసం 4 అంగుళాలు లేదా 10 సెంటీమీటర్ల దూరం ఉండాలి. ఫ్రిజ్‌ను గోడ నుంచి సరైన దూరంలో ఉంచకపోతే, కూలింగ్ మోటారు నుంచి వచ్చే వేడి సరిగ్గా బయటకు రాదని, దీనివల్ల కూలింగ్ తగ్గుతుందని, విద్యుత్ బిల్లు పెరుగుతుందని కూడా వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.


సరైన దూరం ఎందుకు

ఫ్రిజ్ అనేది ఒక విద్యుత్ ఉపకరణం, అది ఉపయోగిస్తున్నప్పుడు వేడెక్కుతుంది. ఆ క్రమంలో వేడిని బయటకు విడుదల చేస్తుంది. మీరు ఫ్రిజ్ వినియోగిస్తున్నప్పుడు దాని ఉపరితలాన్ని తాకినట్లయితే, అది వేడిగా అనిపిస్తుంది. కాబట్టి ఫ్రిజ్ నుంచి వేడి బయటకు రావడానికి ఖాళీ స్థలం అవసరం. కానీ మీరు ఫ్రిజ్‌ను గోడకు చాలా దగ్గరగా ఉంచినప్పుడు, ఆ వేడి సరిగ్గా బయటకు రాదు. అది దాని కంప్రెసర్‌పై లోడ్ పెరిగేందుకు ప్రభావం చూపిస్తుంది. కంప్రెసర్ పై లోడ్ ఎక్కువగా పెరిగినప్పుడు, దాని జీవితకాలం తగ్గుతుంది. అది త్వరగా దెబ్బతింటుంది. కాబట్టి ఇలాంటి ఇబ్బందులకు దూరంగా ఉండాలంటే ఫ్రిజ్, గోడ మధ్య దూరం అనేది చాలా ముఖ్యం.


ఇవీ చదవండి:

ఐదేళ్ల క్రితం స్టాక్ ధర రూ.129, ఇప్పుడు రూ.1679

ప్రజల వద్ద ఉన్న రూ.2000 నోట్లను తిరిగి తీసుకుంటాం..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 02 , 2025 | 08:08 PM