Tight Clothes Health Effects: టైట్ డ్రెస్సులు వేసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయా?
ABN , Publish Date - Oct 22 , 2025 | 03:13 PM
టైట్ డ్రెస్సులు ధరించడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందా? పరిశోధన ఏమి చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించడానికి వివిధ రకాల దుస్తులు ధరిస్తున్నారు. కొంతమంది వదులుగా ఉండే దుస్తులను ఇష్టపడతారు, మరికొందరు టైట్‌గా ఉంటే బట్టలను ఇష్టపడతారు. ఫిట్టెడ్ జీన్స్, లెగ్గింగ్స్, బాడీకాన్ డ్రెస్సులు లేదా స్ట్రెచబుల్ టాప్స్ వంటివి ఎక్కువగా స్టైలిష్‌గా కనిపించేలా చేస్తాయి. కానీ, అదే పనిగా టైట్ డ్రెస్సులు వేసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయని మీకు తెలుసా? ఓ పరిశోధన ప్రకారం, బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం ఆరోగ్యానికి ఎలా హానికరమో ఇప్పుడు తెలుసుకుందాం..
పరిశోధన ఏం చెబుతోంది?
హెల్త్‌లైన్ సర్వే ప్రకారం.. బిగుతుగా ఉండే దుస్తులు సౌకర్యవంతంగా ఉంటాయి. కానీ, వాటిని ధరించడం వల్ల అనేక సమస్యలు వస్తాయట. ముఖ్యంగా చర్మం ఎర్రగా మారడం, చికాకు కలగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలను కలిగిస్తాయి. షేప్‌వేర్, ప్యాంటీహోస్, బిగుతుగా ఉండే లోదుస్తులు చర్మంపై అత్యధిక ప్రభావాన్ని చూపుతాయి.
ఆరోగ్య ప్రభావాలు
బిగుతుగా ఉండే దుస్తులు జీర్ణ సమస్యలను తీవ్రం చేస్తాయి. కడుపు, ప్రేగులపై అదనపు ఒత్తిడి ఏర్పడుతుంది. యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట పెరుగుతుంది. బిగుతుగా ఉండే దుస్తులు జీర్ణక్రియను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. టైట్ ప్యాంటు, ప్యాంటీహోస్ లేదా షేప్‌వేర్ ధరించడం వల్ల శ్వాస సామర్థ్యం తగ్గుతుంది. వ్యాయామాల సమయంలో చెమట పట్టడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. బెల్టులు, జీన్స్ వంటి బిగుతుగా ఉండే దుస్తులు వెన్నెముక నరాల సమస్యకు కారణమవుతాయని, ఇది తొడ వైపు తిమ్మిరి లేదా జలదరింపుకు కారణమవుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
పనితీరుపై ప్రభావం
ఒక అధ్యయనం ప్రకారం.. బిగుతుగా ఉండే వ్యాయామ దుస్తులు మహిళల అథ్లెటిక్ పనితీరును ప్రభావితం చేస్తాయి. వ్యాయామం చేసేటప్పుడు బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం కంఫర్ట్‌గా ఉంటుంది కానీ.. ఆరోగ్య పరంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని పలు సర్వే నివేదికలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి...
శ్రీశైలం కార్తీక మాసోత్సవాలు.. భక్తులకు కీలక సూచనలు
Read Latest AP News And Telugu News