Vastu Shastra: వాస్తు శాస్త్రం ప్రకారం ఈ అలవాట్లుంటే.. అప్పుల ఊబిలో కూరుకుపోతారు..
ABN , Publish Date - Apr 29 , 2025 | 01:57 PM
Vastu Shastra Effects:వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రోజువారీ కార్యక్రమాలు మన జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఈ చెడు పద్ధతులు అలవాట్లుగా మారితే ఆ ఇంట్లో సుఖశాంతులు ఉండవు. ప్రతికూల శక్తి ప్రవేశించి సంపద మొత్తం కోల్పోతారు. అప్పుల ఊబిలోంచి ఎప్పటికీ బయటపడలేరని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Daily Vastu Shastra Rituals: వాస్తు శాస్త్రంలో ఇంట్లోని ప్రతి దిశకూ ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఇంట్లో వస్తువులను ఆయా దిశల్లో కాకుండా తప్పు దిశలో ఉంచితే అది మొత్తం ఇంటిపైనా, కుటుంబ సభ్యులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతారు. అదేవిధంగా మన రోజువారీ కార్యకలాపాలు కూడా జీవితాలపై సానుకూల లేదా ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. తెలిసీ తెలియక చేసే ఈ కొన్ని తప్పులు మన సంపదని హరించి జీవితాన్ని అల్లకల్లోలం చేస్తాయి. ఆర్థిక పరిస్థితులు దిగజారిపోయి లేనిపోని సమస్యలు ఎదురు కాకూడదంటే ఆ చెడు అలవాట్లు ఏంటో తెలుసుకుని జాగ్రత్త పడండి.
పాత్రల పరిశుభ్రత
వాస్తు శాస్త్రం ప్రకారం మురికిగా లేదా ఉపయోగించిన పాత్రలను రాత్రిపూట ఇంట్లో ఉంచకూడదు. ఆలస్యమైనా, పడుకునే ముందు గిన్నెలు కడగడం మర్చిపోవద్దు. ఇలా చేయడం వల్ల అన్నపూర్ణ ఆశీస్సులు లభిస్తాయని, తద్వారా జీవితంలో సంపద, ఆహారానికి ఎప్పుడూ కొరత ఉండదని నమ్ముతారు..
మంచం మీద కూర్చుని తినడం
మంచం మీద కూర్చొని ఎప్పుడూ ఆహారం తింటే లక్ష్మీ దేవికి కోపం వస్తుంది అంటారు వాస్తునిపుణులు. దీంతో మీరు ఆస్తిపాస్తులు కోల్పోయి ఆనందం, శ్రేయస్సుకు దూరమవుతారు.
ఖాళీ బకెట్లు
ఖాళీ బకెట్లు, టబ్‌లు మొదలైన వాటిని బాత్రూంలో ఎప్పుడూ ఉంచకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం, బాత్రూంలో ఎల్లప్పుడూ నీటితో నిండిన బకెట్ లేదా కంటైనర్ ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంటికి సానుకూల శక్తి వచ్చి ఆనందం, శ్రేయస్సు వస్తాయి.
చెత్తడబ్బా
ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఎప్పుడూ చెత్త డబ్బాను ఉంచకూడదని అంటారు. ఇక్కడి నుండే లక్ష్మీ దేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇలా చేయడం వల్ల సంపద దేవత కోపమొచ్చి వాకిట్లోంటే వెనుతిరుగుతుందని అంటారు. కాబట్టి వీలైనంత వరకూ ఇంట్లో చెత్త డబ్బాను ఉంచవద్దు.
సాయంత్రం పూట ఈ వస్తువులను ఇవ్వకండి
వాస్తు శాస్త్రం ప్రకారం సాయంత్రం లేదా సూర్యాస్తమయం తర్వాత ఎప్పుడూ పాలు, పెరుగు లేదా ఉప్పును దానం చేయవద్దు. దీనివల్ల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోతుందని.. ఆ వ్యక్తి అప్పుల భారం ఇంకా పెరుగుతుందని నమ్ముతారు.
ఇంట్లోని ప్రతికూలతలు ఎలా తొలగించాలి?
ప్రతికూల శక్తిని తొలగించడానికి ఇంట్లో చిటికెడు ఉప్పు ఉంచుకోవాలి.
చిన్న చిన్న విషయాలకే ఇంట్లో గొడవ జరిగితే ఇంటిని ఉప్పు నీటితో శుభ్రం చేయాలి.
ఇంటిని సరిగ్గా అలంకరిస్తే సానుకూల శక్తి ఉంటుంది.
వాస్తు దోషాల వల్ల ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి.
ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉంటాయి. అందుకే వాస్తు దోషాలను తొలగించాలి.
Read Also: Gold : బంగారం ధరించే ముందు ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి..
Habits That Stay You Poor: ఈ అలవాట్లు వదలకపోతే జీవితాంతం పేదవారిగానే ఉంటారు..
Chanakya Niti On Marriage life: వివాహం తర్వాత ఈ 4 తప్పులు