Trending Lip Shades: ట్రెండింగ్ లిప్ షేడ్స్.. మీ లుక్‌కు పర్‌ఫెక్ట్ మ్యాచ్!
ABN , Publish Date - Nov 21 , 2025 | 06:38 PM
అమ్మాయిలు ఎప్పుడూ అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకుంటారు. ఇందుకోసం స్కిన్‌కేర్ నుంచి మేకప్ వరకు, ఫ్యాషన్ నుంచి హెయిర్‌స్టైల్ వరకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు.
ఇంటర్నెట్ డెస్క్: అమ్మాయిలు సాధారణంగానే ఎప్పుడూ అందంగా, ఆకర్షణీయంగా కనిపించడానికి ఇష్టపడతారు. ఇక, అలాంటిది పెళ్లి అంటే ఎంత హడావిడి చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వధువుగా తన అలంకరణ అందరినీ ఆకట్టుకోవాలనే కోరుకుంటుంది. చీరకు తగ్గట్టు తగిన జ్యువెలరీ, హెయిర్‌స్టైల్ వంటివన్నీ ఎంచుకుంటుంది. పెళ్లి రోజున మరింత అందంగా కనిపించడానికి మేకప్ కూడా చేపించుకుంటుంది. అయితే, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వివిధ ఫ్యాషన్, మేకప్ ట్రెండ్లు వైరల్ అవుతున్నాయి. చాలా మంది ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిన లిప్ షేడ్స్‌ను ఎంచుకుంటారు. ట్రెండింగ్‌లో ఉన్న కొన్ని లిప్ షేడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ట్రెండింగ్ లిప్ షేడ్స్ ఇవే:
ఈ పెళ్లి సీజన్‌లో న్యూడ్ బ్రౌన్ లేదా న్యూడ్ పింక్ లిప్ షేడ్‌ను ఉపయోగిస్తే, మీ లుక్ మరింత ఆకర్షణీయంగా, స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఇవి వధువులు, తోడిపెళ్లికూతుళ్లకు పర్‌ఫెక్ట్‌గా సరిపోయే ఎలిగెంట్ షేడ్స్‌గా మారాయి.
మావ్ పింక్ లిప్ షేడ్స్‌ను కాలేజీకి వెళ్లే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ లిప్ షేడ్ ఫంక్షన్లకు సరిగ్గా సరిపోతుంది. ఈ షేడ్ స్టైలిష్‌గా అద్భుతంగా కనిపిస్తుంది.
పెళ్లికూతురి లుక్‌ను వెంటనే హైలైట్ చేసే షేడ్ అంటే అది బోల్డ్ రెడ్. ఈ రంగు వధువుకు క్లాసిక్, రాయల్ లుక్‌ను ఇస్తుంది.
బ్రౌన్ లిప్ షేడ్ మీకు క్లాసిక్, క్లీన్ మరియు సింపుల్ లుక్‌ను అందిస్తుంది. ప్రత్యేకంగా న్యూడ్ మేకప్‌తో కలిపితే, ఈ షేడ్ ఏ స్టైల్‌కైనా ఎలిగెంట్‌గా సరిపోతుంది. లైట్ కలర్ అవుట్‌ఫిట్స్‌పై బ్రౌన్ లిప్ కలర్‌ను జత చేస్తే మీ లుక్‌లో అదనపు గ్రేస్, సోఫిస్టికేషన్ కనిపిస్తుంది.
Also Read:
ఎప్పుడూ అలసటగా అనిపిస్తుందా? కారణాలు ఏంటో తెలుసుకోండి.!
శీతాకాలంలో అరటిపండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా? ఇలా చేయండి.!
For More Lifestyle News