Share News

Land Snorkelling: ల్యాండ్ స్నార్కెలింగ్ .. 2025లో సరికొత్త ట్రెండ్.!

ABN , Publish Date - Jul 21 , 2025 | 04:13 PM

ఈ మధ్యకాలంలో ప్రయాణం పట్ల ప్రజల అభిరుచులు మారిపోతున్నాయి. హైకింగ్, వాకింగ్ అంటూ ప్రకృతిలో గడిపే సమయం పట్ల ఆసక్తి పెరుగుతోంది. ఇప్పుడు కొత్తగా ల్యాండ్ స్నార్కెలింగ్ అనే సరికొత్త ప్రయాణ ట్రెండ్ యువతను ఆకర్షిస్తోంది. అసలు, ల్యాండ్ స్నార్కెలింగ్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

Land Snorkelling: ల్యాండ్ స్నార్కెలింగ్ .. 2025లో సరికొత్త ట్రెండ్.!
Land Snorkelling

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రకృతిని లోతుగా ఆస్వాదించాలనుకునే వారి కోసం ఇప్పుడు ఒక కొత్త ప్రయాణ ధోరణి అందుబాటులోకి వచ్చింది. దీనినే ల్యాండ్ స్నార్కెలింగ్ అంటారు. సాధారణంగా స్నార్కెలింగ్ అంటే నీటి లోతుల్లో ఈత కొడుతూ సముద్ర జీవులను చూడడం. అదే విధంగా, నీటితో ఎలాంటి సంబంధం లేకుండా, కేవలం భూమిపై ఉన్న ప్రకృతి అందాలను నెమ్మదిగా తిలకిస్తూ నడవడాన్ని ల్యాండ్ స్నార్కెలింగ్‌ అంటారు. ల్యాండ్ స్నార్కెలింగ్ అనేది ఎడారులు, ఇసుక దిబ్బలు, పర్వతాల పొరలు, లేదా అగ్నిపర్వత భూభాగం వంటి ప్రాంతాల్లో నెమ్మదిగా నడుచుకుంటూ, చిన్న చిన్న ప్రకృతి అంశాలను గమనించడమే లక్ష్యం.


సాధారణ హైకింగ్ లాంటి ప్రయాణాల్లో ఎక్కడికైనా చేరుకోవడమే ప్రధాన ఉద్దేశంగా ఉంటుంది. కానీ ల్యాండ్ స్నార్కెలింగ్‌లో ఎటువంటి గమ్యస్థానం ఉండదు. ప్రకృతిలో నెమ్మదిగా తిరుగుతూ, సాధారణంగా మనం దృష్టి పెట్టని చిన్న చిన్న ప్రకృతి విశేషాలను గమనించాలి. ఉదాహరణకు, గాలి వల్ల పొడి గడ్డి ఎలా కదులుతుందో చూడడం, నేలపై పడి ఉన్న ఆకులను గమనించడం, పుట్టగొడుగుల రూపాలను పరిశీలించడం లాగా ఉంటాయి.

ల్యాండ్ స్నార్కెలింగ్ అనే పదాన్ని అమెరికాలోని మోంటానా రాష్ట్రానికి చెందిన కళాకారులు క్లైడ్ ఆస్పెవిగ్, కరోల్ గుజ్మాన్ సృష్టించారు. వీరిద్దరూ అమెరికాలో ఉన్న పెద్ద సహజ రిజర్వ్ అయిన అమెరికన్ గడ్డి మైదానం (సుమారు 4.6 లక్షల ఎకరాలు విస్తీర్ణంలో) లో స్వచ్ఛంద సేవకులుగా పనిచేశారు. అక్కడి సహజ వాతావరణం, మొక్కలు, జంతువులు, శిలాజాలు అలాగే ప్రకృతిని గమనించే తీరే వీరిని కొత్త ఆలోచించేలా చేసింది.


అరిజోనాలోని సెడోనా సమీపంలో వీరిద్దరూ ఒకసారి నడకకు వెళ్తే, కరోల్ పాదాల కింద కనిపిస్తున్న వృక్షాలు, చిన్న జీవులను ఎంతో ఆసక్తిగా గమనించారట. అదే సమయంలో ఆమె ముఖం ఆనందంతో మెరిసిపోయిందని, అప్పుడే ల్యాండ్ స్నార్కెలింగ్ అనే పేరు పెట్టినట్టు క్లైడ్ గుర్తు చేశారు.

భారతదేశంలో ల్యాండ్ స్నార్కెలింగ్‌కు సరైన ప్రదేశాలు

  • భారతదేశంలో ప్రకృతి వైవిధ్యం చాలా ఎక్కువ. అందువల్ల ల్యాండ్ స్నార్కెలింగ్‌కు సరైన ప్రదేశాలు చాలా ఉన్నాయి.

  • రాజస్థాన్ లోని థార్ ఎడారి, ఇసుక దిబ్బలు, ఎడారి మొక్కలు, వన్యప్రాణులు గమనించడానికి మంచి చోటు.

  • గుజరాత్ లోని రాన్ ఆఫ్ కచ్, తెల్ల ఉప్పు నేల, ఉప్పు స్ఫటికాలు, వింత రేఖలు, వన్యప్రాణుల అడుగుల గుర్తులు.

  • మహారాష్ట్ర లోని దక్కన్ పీఠభూమి, బసాల్ట్ రాళ్లు, పురాతన శిలాజాలు, పురాతన శిల్పాలు.

  • తమిళనాడులో ఉన్న నీలగిరి కొండలు, చెట్ల మధ్య రోడ్లు, తేయాకు తోటల ప్రాంతాలు, చిన్న జీవాల జాడలు.

  • కర్ణాటక, కేరళలోని పశ్చిమ కనుమల అటవీ అంచులు. వర్షాకాలం తర్వాత తేమగా ఉండే అడవి ప్రాంతాలు, పుట్టగొడుగులతో నిండి ఉండే నేలలు.


ల్యాండ్ స్నార్కెలింగ్ అనేది ప్రకృతిని దగ్గరగా చూసే ఒక ప్రత్యేక మార్గం. ప్రతి అడుగులో ప్రకృతిని ఆస్వాదించే అనుభూతి. 2025లో ట్రావెల్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న ఈ కొత్త ధోరణి, మనం ప్రకృతిలో ఎక్కువ సమయాన్ని గడిపేందుకు ప్రేరణనిస్తోంది. భారతదేశంలోని థార్ ఎడారి, నీలగిరి కొండలు, రాన్ ఆఫ్ కచ్ వంటి ప్రాంతాలు ఈ ప్రయాణానికి ఎంతో అనుకూలంగా మారాయి.


Also Read:

గంగాసాగర్ టూ కాశీ..

తక్కువ జీతం ఉన్నవారికి శుభవార్త!

For More Lifestyle News

Updated Date - Jul 21 , 2025 | 04:15 PM