Share News

Travel Tips: వర్షాకాలం స్పెషల్.. ప్రకృతి ప్రేమికులకు స్వర్గంలా అనిపించే డెస్టినేషన్లు ఇవే!

ABN , Publish Date - Jul 20 , 2025 | 11:11 AM

చాలా మంది ప్రకృతి ప్రేమికులకు వర్షాకాలం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే, వర్షం పడినప్పుడు ప్రకృతి మరింత అందంగా, పచ్చగా మారుతుంది. అయితే, ఈ సీజన్‌లో స్వర్గంలా అనిపించే కొన్ని డెస్టినేషన్లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Travel Tips: వర్షాకాలం స్పెషల్.. ప్రకృతి ప్రేమికులకు స్వర్గంలా అనిపించే డెస్టినేషన్లు ఇవే!
Travel Tips

ఇంటర్నెట్ డెస్క్‌ : చాలా మంది ప్రకృతి ప్రేమికులకు వర్షాకాలం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే, వర్షం పడినప్పుడు ప్రకృతి మరింత అందంగా, పచ్చగా మారుతుంది. జలపాతాలు, హిల్ స్టేషన్లు, వన్యప్రాణి అభయారణ్యాలు ఒక మ్యాజిక్‌లా కనిపిస్తాయి. ఈ సీజన్‌లో స్వర్గంలా అనిపించే కొన్ని డెస్టినేషన్లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


వయనాడ్, కేరళ

వయనాడ్ వర్షాకాలంలో చాలా అందంగా ఉంటుంది. పచ్చదనంతో నిండిపోయి, మరింత ఆహ్లాదకరంగా మారుతుంది. ప్రకృతి ప్రేమికులకు, సాహసయాత్రలు చేసేవారికి ఇది గొప్ప ప్రదేశం. వర్షాల వల్ల వయనాడ్ లోని కొండలు, లోయలు, అడవులు అన్నీ పచ్చగా మారిపోతాయి. ప్రకృతి మరింత అందంగా కనిపిస్తుంది. వయనాడ్ సుగంధ ద్రవ్యాలకు కూడా ప్రసిద్ధి. వర్షాకాలంలో ఈ తోటలు మరింత సువాసనతో నిండిపోతాయి.


వాలీ ఆఫ్ ఫ్లవర్స్, ఉత్తరాఖండ్

వర్షాకాలంలో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ మొత్తం పుష్పాలతో నిండిపోతుంది. వర్షాల వల్ల లోయలో పువ్వులు వికసిస్తాయి, పచ్చదనం పెరుగుతుంది. వాతావరణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. 300కి పైగా రకాలు విరజిమ్మే పూలతో ఈ ప్రాంతం నిజంగా ఒక స్వర్గంలా ఉంటుంది.

చిక్కమగళూరు, కర్ణాటక

కర్ణాటకలోని చిక్కమగళూరు వర్షాకాలంలో పచ్చని అద్భుత ప్రదేశంగా మారుతుంది. దక్షిణ భారతదేశంలోని ఈ ప్రసిద్ధ కొండ ప్రాంతం కాఫీ ఎస్టేట్‌లు, సుందరమైన డ్రైవ్‌లు, వర్షాకాల జలపాతాలకు ప్రసిద్ధి చెందింది. ప్రయాణ ప్రియులు ముల్లయనగిరి శిఖరాన్ని అధిరోహించవచ్చు.


ఉదయపూర్, రాజస్థాన్

రాజస్థాన్ ఎడారి ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. వర్షాలతో నిండిన సరస్సులు మరింత అందంగా కనిపిస్తాయి. ఈ సీజన్‌లో ఉదయపూర్ ఆశ్చర్యకరంగా శృంగారభరితంగా ఉంటుంది.

షిల్లాంగ్, మేఘాలయ

ఈశాన్య భారతంలో ఉన్న ఈ హిల్ స్టేషన్ వర్షాకాలంలో చాలా ఆకట్టుకుంటుంది. జలపాతాలు, సరస్సులు కనుల పండుగగా ఉంటాయి. ప్రకృతి ప్రేమికులు ఈ ప్రాంతాన్ని మరింత ఇష్టపడతారు.

మున్నార్, కేరళ

పశ్చిమ కనుమలలోని ఈ హిల్ స్టేషన్ వర్షాకాలంలో మరింత అద్భుతంగా మారుతుంది. తేయాకు తోటలు, పొగమంచుతో కప్పబడిన కొండలు, జలపాతాలు, ఫోటో గ్రాఫీకి, రిలాక్సేషన్‌కి మున్‌నార్ ఉత్తమ ప్రదేశం. మొత్తంగా చెప్పాలంటే, వర్షాకాలం సహజ సౌందర్యాలను ఆస్వాదించడానికి చక్కని సమయం. ఇక ఆలస్యం చేయకుండా మీకు సరిపోయే ప్రదేశాన్ని ఎంచుకొని, ప్యాకింగ్ మొదలు పెట్టండి.


Also Read:

గంగాసాగర్ టూ కాశీ..

తక్కువ జీతం ఉన్నవారికి శుభవార్త!

For More Lifestyle News

Updated Date - Jul 20 , 2025 | 11:41 AM