Toilet Seat: టాయిలెట్ సీటు తెరిచి ఉంచాలా.. మూసి ఉంచితే మంచిదా..
ABN , Publish Date - Apr 29 , 2025 | 09:07 AM
Toilet Lid Hygiene Tips: మనం రోజూ బాత్రూం ఉపయోగిస్తాం. కానీ, కొందరు టాయిలెట్ సీట్లు మూసి ఉంచితే, మరికొందరు తెరిచే ఉంచుతారు. కానీ, వాష్ రూంలో హానికరమైన బ్యాక్టీరియాను నివారించాలంటే ఏ పద్ధతి మంచిదో మీకు తెలుసా..

Leaving Toilet Lid Up: ఇప్పుడు ఇళ్ళు, ఆఫీసులు, పబ్లిక్ టాయిలెట్లు, రెస్టారెంట్లు ఇలా చాలా చోట్ల వెస్ట్రన్ టాయిలెట్లే ఉంటాయి. అయితే, మీరు దీన్ని ఉపయోగించేటప్పుడు కొన్ని విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి. దానిపై కూర్చునే విధానం, ఉపయోగించిన తర్వాత సీటును మూయాలా.. వద్దా.. ఇలాంటివి అన్నమాట. ఎందుకంటే ఈ చిన్నపాటి అలవాట్లే మీ ఆరోగ్యానికి శ్రీరామరక్ష అంటున్నారు డాక్టర్లు. వీటిని పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఏ అనారోగ్య సమస్యలు వస్తాయో చెప్పలేం అని హెచ్చరిస్తున్నారు. కాబట్టి, టాయిలెట్ వాడిన తర్వాత సీటు మూసి ఉంచాలో.. వద్దో.. తెలుసుకుందాం..
టాయిలెట్ సీటు మూతను ఎందుకు మూసివేయాలి?
టాయిలెట్ సీటు మూత తెరిచి ఫ్లష్ చేయడం వల్ల గాలిలోకి బ్యాక్టీరియా విడుదల అవుతుంది. అవి గోడలు, టూత్ బ్రష్‌లు, టవల్స్ వంటి వస్తువులపై అంటుకుని వాటిని కలుషితం చేస్తాయి. ఇలాంటి కలుషితమైన వస్తువులను తాకినా, మురికి బ్రష్ లేదా టవల్ ఉపయోగించినా ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అదే వాడిన వెంటనే సీటు మూసేస్తే వైరల్ బ్యాక్టీరియా వ్యాప్తిని అరికట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ప్రతిరోజూ టాయిలెట్ శుభ్రత కోసం క్రిమిసంహారక మందును ఉపయోగించాలి. తరచుగా చేతులు కడుక్కుంటూ ఉండటం వల్ల బ్యాక్టీరియా వ్యాప్తిని నివారించవచ్చు.
ఇదే మంచి అలవాటు
మీ టాయిలెట్ ఎంత శుభ్రం చేసినా రోజూ వాడిన తర్వాత కొద్దిగా మురికిగా మారుతుంది. అలాంటప్పుడు టాయిలెట్ సీటు మూత మూసేస్తే మీ బాత్రూమ్ శుభ్రంగా కనిపిస్తుంది. బాత్రూంలోకి వెళ్లిన ప్రతిసారీ దానిపై మరకలు కూడా కనిపించవు. కాబట్టి వాడిన తర్వాత టాయిలెట్ సీటు మూత మూయడం మంచి అలవాటు.
పిల్లలకూ సురక్షితం
చిన్నపిల్లలు ఓపెన్ టాయిలెట్ సీట్ల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు. ఇలా ఉంటే పిల్లలు అందులో పడిపోతాడనే భయం ఉండవచ్చు. ఇదే కాకుండా పిల్లలు ఏవైనా ముఖ్యమైన వస్తువులను పట్టుకెళ్లి టాయిలెట్లలో వేసే అవకాశమూ ఉంది. కాబట్టి మూత మూసి ఉంచడమే సురక్షితం.
Read Also: Yoga For Migraine: తరచూ తల భారంగా ఉంటోందా.. ఈ యోగాసనాలతో శాశ్వత పరిష్కారం..
Happy In Life: ఈ ఆరు అలవాట్లు మీ జీవితాన్నే మార్చేస్తాయి.. తప్పక
Children Education Tips: పిల్లల్ని చదువుకోమని బలవంతం చేస్తున్నారా.. కలిగే నష్టాలు తెలుసుకోండి..