Share News

Jewellery Benefits: మంగళసూత్రం నుండి గాజుల వరకు.. స్త్రీల ఆభరణాల వెనుక ఆరోగ్య రహస్యాలు ఇవే..

ABN , Publish Date - Jun 26 , 2025 | 04:21 PM

ఆభరణాలు అందానికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి. చాలా మంది ఆభరణాలను కేవలం అందం కోసం ధరిస్తారు. కానీ కొన్ని రకాల ఆభరణాలు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Jewellery Benefits: మంగళసూత్రం నుండి గాజుల వరకు.. స్త్రీల ఆభరణాల వెనుక ఆరోగ్య రహస్యాలు ఇవే..
Jewellery Benefits

Jewellery Benefits: స్త్రీలు ధరించే ప్రతి ఆభరణం వెనుక ఒక సాంప్రదాయం, ఒక శాస్త్రీయ దృక్కోణం దాగి ఉంది. ఈ ఆభరణాలు అందానికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి. చాలా మంది స్త్రీలు ఆభరణాలను కేవలం అందం కోసం ధరిస్తారు. కానీ, ఆభరణాలు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రతి ఆభరణం వెనక ఒక ప్రత్యేక ప్రయోజనం దాగి ఉందని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


మంగళసూత్రం:

పెళ్లైన స్త్రీలు మంగళసూత్రాన్ని ధరిస్తారు. అయితే, ఇది కేవలం సౌభాగ్యానికి చిహ్నం మాత్రమే కాదు.. భర్త ఆయుష్షుని మంగళసూత్రం పెంచుతుంది అని నమ్ముతారు. దీన్ని ధరించడం వలన గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయని భావిస్తారు.

పాపిడి బిళ్ల:

పాపిడి బిళ్ల ధరించడం వలన కేవలం అందంగా కనిపించడం మాత్రమే కాదు.. జ్ఞానాన్ని కూడా పెంచుకోవచ్చు.

వడ్డానం :

ఈ ఆభరణం జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. అలాగే, నడుము సన్నగా కనిపించేలా చేస్తుంది.


పట్టీలు:

కాళ్లకు ధరించే ఈ ఆభరణాలు శరీరంలోని వేడిని నియంత్రించడమే కాకుండా, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

నెక్లెస్:

గొంతుకు ధరించే హారాలు శరీరానికి శాంతిని ఇచ్చేలా పనిచేస్తాయని నమ్మకం. దేవుని చిహ్నాలు ఉన్న నెక్లెస్‌లు మానసిక శాంతికి దోహదం చేస్తాయి.

మెట్టెలు:

వేలి నరాలకు, గర్భాశయానికి సంబంధం ఉందని ఆయుర్వేదం చెబుతుంది. కాబట్టి, మెట్టెలు ధరించడం గర్భాశయ ఆరోగ్యానికి తోడ్పడుతుంది.


చెవి దిద్దులు:

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చెవులకు దుద్దులు పెట్టుకుంటే బుధ, గురు గ్రహాలు బలంగా ఉంటాయని, తద్వారా బుద్ధి వికాసం, శక్తి పెరుగుదల, మెదడు చురుగ్గా పనిచేయడం, కంటి చూపు మెరుగుపడటం వంటివి జరుగుతాయని నమ్ముతారు.

గాజులు:

గాజులు వేసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. హార్మోన్ల సమతుల్యతకు సహాయపడుతుంది. కొన్ని నమ్మకాల ప్రకారం అదృష్టాన్ని, సంతోషాన్ని చేకూరుస్తుంది. గాజుల శబ్దం కూడా ఆనందాన్ని ఇస్తుందని కొందరు నమ్ముతారు. అలాగే, గాజుల శబ్దం శుభాన్ని ఆకర్షిస్తుందని అంటారు.

ముక్కుపుడక:

ప్రసవ సమయంలో నొప్పిని తగ్గించడంలో ముక్కుపుడక ఉపయోగపడుతుంది అని ఆయుర్వేదం చెబుతోంది. ఇది నాడీ వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతుంది.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)


Also Read:

బద్దకానికి కారణమయ్యే ఆహారాలు ఇవే..

పళ్ల చిగుళ్లు ఎందుకు ఉబ్బుతాయి? నివారణకు ఏం చేయాలి?

For More Lifestyle News

Updated Date - Jun 26 , 2025 | 04:23 PM