Beauty Tips: చర్మంపై మచ్చలతో బాధపడుతున్నారా.. ఈ కూరగాయ రసంతో చెక్ పెట్టండి..
ABN , Publish Date - Jul 03 , 2025 | 09:57 AM
చాలా మంది అమ్మాయిలు ముఖంపై మచ్చలతో బాధపడుతుంటారు. అయితే, అలాంటి వారు ఈ కురగాయ రసంతో మచ్చల సమస్య నుండి బయటపడవచ్చని చర్మ నిపుణులు చెబుతున్నారు. ఆ కురగాయ రసం ఏంటో తెలుసుకుందాం..

Beauty Tips: ముఖంపై మచ్చలు వివిధ కారణాల వల్ల వస్తాయి. చాలా మంది అమ్మాయిలు ముఖంపై మచ్చలతో బాధపడుతుంటారు. సూర్యరశ్మికి గురికావడం, మొటిమలు, గాయాలు, లేదా చర్మ సంబంధిత సమస్యలు వంటి కారణాల వల్ల మచ్చలు ఏర్పడతాయి. వాటిని తగ్గించుకోవడానికి ఇంటి చిట్కాలు, చర్మ సంరక్షణ ఉత్పత్తులు వంటివి ట్రై చేస్తుంటారు. అయితే, అలాంటి వారు ఈ కురగాయ రసంతో మచ్చల సమస్య నుండి బయటపడవచ్చని చర్మ నిపుణులు చెబుతున్నారు. ఆ కురగాయ రసం ఏంటో తెలుసుకుందాం..
బంగాళాదుంప రసం మచ్చలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఇది చర్మంపై నల్లటి మచ్చలు, మొటిమలు, ఇతర మచ్చలను తగ్గించడంలో సహాయపడే సహజమైన బ్లీచింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. బంగాళాదుంపలలోని సహజమైన పిండి పదార్థాలు, సాలిసిలిక్ ఆమ్లం మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ రసంలోని విటమిన్ సి, ఇతర పోషకాలు నల్ల మచ్చలను తొలగిస్తాయి. బంగాళాదుంప రసం చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. సహజమైన మెరుపును ఇస్తుంది.
బంగాళాదుంప రసాన్ని ఉపయోగించే విధానం:
ఒక బంగాళాదుంపను మెత్తగా రుబ్బుకుని రసం తీసుకోవాలి.
ఈ రసాన్ని మచ్చలు ఉన్న ప్రదేశాలలో రాయండి.
ఒక 15-20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి.
ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
గుర్తుంచుకోవలసిన విషయాలు:
మీరు ఏదైనా కొత్త ఉత్పత్తిని ఉపయోగించే ముందు, అది మీ చర్మానికి సరిపోతుందో లేదో తెలుసుకోవడానికి చేతిపై ఉన్న మచ్చలకు ట్రై చేసి టెస్ట్ చేయడం మంచిది.
బంగాళాదుంప రసాన్ని అప్లై చేసిన తర్వాత సూర్యరశ్మికి దూరంగా ఉండండి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
మీ భార్య తరచుగా కోపంగా ఉంటుందా.. ఇలా కూల్ చేయండి..
సహజ సౌందర్యానికి ముక్కుపుడక..దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..
For More Lifestyle News