Share News

Online shopping Tips: ఆన్‌లైన్‌లో బట్టలు కొంటున్నారా.. క్వాలిటీ చెక్ చేయడమెలా..

ABN , Publish Date - Apr 12 , 2025 | 01:34 PM

Online Cloth Shopping Tips: ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన బట్టలు తీరా డెలివరీ చేశాక నాణ్యత విషయంలో తరచూ సమస్యలు ఎదురవుతుంటాయి. ఫోన్‌లో చూసినప్పుడు ఉన్నంత క్వాలిటీ రియాలిటీలో ఉండదు. ఇలా మరోసారి జరగకూడదంటే ఫ్యాబ్రిక్ నాణ్యతను దానిని తాకకుండానే ఇలా తెలుసుకోవచ్చు.

Online shopping Tips: ఆన్‌లైన్‌లో బట్టలు కొంటున్నారా..  క్వాలిటీ చెక్ చేయడమెలా..
How to Buy Quality Dresses in Online

Online Shopping Fabric Quality Checking Tips: ఈ రోజుల్లో చాలామంది ప్రజలు బట్టలు కొనడానికి ఆన్‌లైన్ షాపింగ్‌నే ఆశ్రయిస్తున్నారు . కాకపోతే, ఆర్డర్ చేసేముందు ఫాబ్రిక్ నాణ్యత మంచిదా చెడ్డదా అని ఒకటికి నాలుగుసార్లు పరిశీలించినా కనుక్కోవడం కష్టమవుతుంది. ఎందుకంటే, డ్రెస్ డెలివరీ చేసిన తర్వాత అనుకున్నంత నాణ్యతలో బట్టలు ఉండవు. ఆన్‌లైన్‌లో బట్టలను తాకకుండానే వాటి నాణ్యతను ఎలా తనిఖీ చేయాలో తెలియకపోవడమే అసలైన కారణం. ఈ చిట్కాలను అనుసరించారంటే ఆన్‌లైన్‌లో కూడా మీరు కచ్చితంగా క్వాలిటీ దుస్తులను కొనుగోలు చేయగలుగుతారు. అదెలాగో తెలుసుకోండి


  • స్టిక్కర్

    కొన్నిసార్లు రెడీమేడ్ బట్టలను చేతులతో తాకిన తర్వాత కూడా వాటి నాణ్యతను నిర్ధారించడం కష్టం. అటువంటి పరిస్థితిలో బట్టలపై ఉన్న లేబుల్‌ని చూడటం ద్వారా నాణ్యతను నిర్ణయించవచ్చు.


  • బ్లాక్, గోల్డ్ లేబుల్

    ఏదైనా బట్టలపై బ్లాక్ కలర్ లేబుల్ ఉండి బంగారు రంగులో రాసి ఉంటే ఆ వస్త్రం నాణ్యత చాలా బాగుందని అర్థం. కాబట్టి, ఈసారి బయట షాపింగ్ చేసేటప్పుడు ఈ లేబుల్ చెక్ చేసుకోవడం మర్చిపోకండి.


  • వైట్ లేబుల్

    ఒక వస్త్రంపై తెలుపు లేదా క్రీమ్ రంగు లేబుల్ ఉండి దానిపై నలుపు రంగులో రాసి ఉంటే.. ఆ వస్త్రం క్వాలిటీ ఫోకస్డ్ క్లాసిక్ కేటగిరీకి చెందినదని అర్థం.


  • బ్లాక్ లేబుల్

    బట్టలపై ఉన్న లేబుల్ రంగు నల్లగా ఉండి క్రీమ్ కలర్‌లో రాసి ఉంటే.. ఆ బట్టలు డిజైనర్ స్థాయికి చెందినవని, వాటి నాణ్యత ప్రీమియంగా ఉంటుందని అర్థం.


  • రంగురంగుల లేబుల్స్

    ఏదైనా బట్టలపై ఆకుపచ్చ, గులాబీ వంటి నియాన్ రంగుల లేబుల్‌లు ఉండి.. బోల్డ్ ప్యాటర్న్‌లో వ్రాయబడి ఉన్నట్లయితే.. ఆ బట్టలు తాజా ఫ్యాషన్ ట్రెండ్ ప్రకారం ఉన్నట్లు లెక్క. కానీ, అలాంటి బట్టలు అతి తక్కువ నాణ్యతతో ఉంటాయని గుర్తుంచుకోండి.


Read Also: Parenting Tips: 10-14 ఏళ్ల వయసున్న పిల్లలు ప్రైవసీ కోరుకుంటే.. ఈ 4 విషయాలు పొరపాటున కూడా చెప్పకండి..

Reduce Belly Fat: జపనీస్ సీక్రెట్.. ఈ వాటర్ తాగితే బాన పొట్ట పరార్..

Chanakya Niti on Revenge: చాణక్య నీతి

Updated Date - Apr 12 , 2025 | 01:45 PM