Nose piercing: సహజ సౌందర్యానికి ముక్కుపుడక..దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..
ABN , Publish Date - Jul 01 , 2025 | 10:53 AM
ముక్కుపుడక ధరించడం వల్ల స్త్రీ అందం పెరుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ, ఇది కేవలం అలంకరణకే పరిమితం కాదు. మహిళల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

Nose piercing: ఆడపిల్ల అన్నాక ముక్కు పుడక పెట్టుకోవాలనే ఆనవాయితీ పూర్వం నుంచి వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, ఇది కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు.. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముక్కు పుడక స్త్రీల సౌందర్యాన్ని పెంచుతుందని నమ్ముతారు. ఇది ముఖానికి ఒక ప్రత్యేక ఆకర్షణను ఇస్తుంది. కొన్ని సంస్కృతులలో ముక్కు పుడక వివాహానికి గుర్తుగా ఉంటుంది. వివాహిత స్త్రీలు దీనిని ధరించడం తప్పనిసరిగా భావిస్తారు. ముక్కు పుడక ధరించడం వల్ల కుటుంబానికి అదృష్టం, సానుకూల శక్తి వస్తుందని, చెడు ప్రభావాలు తొలగిపోతాయని కొందరు నమ్ముతారు. అలాగే, ముక్కు పుడక ధరించడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయని అంటారు.
ముక్కు పుడకను ఎడమ వైపున పెట్టుకోవడం అనేది సాధారణంగా సాంప్రదాయం. అయితే, కొందరు తమ ముఖానికి ఏ వైపు నప్పుతుందని భావిస్తారో ఆ వైపున పెట్టుకుంటారు. ముక్కు పుడక ధరించడం వలన అనేక ప్రయోజనాలున్నాయని నమ్ముతారు. ముఖ్యంగా మహిళలు ముక్కుపుడక ధరించడం వలన అందం పెరగడంతో పాటు శ్వాసకోశ సమస్యలు, రుతుక్రమ సమస్యలు, ప్రసవ సమయంలో నొప్పి వంటి వాటి నుండి ఉపశమనం లభిస్తుందని కొందరు నమ్ముతారు. అలాగే, చెవినొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది. కానీ, ముక్కుపుడక ఆరోగ్య ప్రయోజనాలు తెలియక ఈ కాలంలో చాలా మంది అమ్మాయిలు ఇది పాత పద్ధతి అంటూ తక్కువ అంచనా వేస్తున్నారు. అయితే, ప్రస్తుతం ముక్కు పుడకలను ఎంతో ఆకర్షణీయంగా, వివిధ రకాల డిజైన్లలో అందుబాటులోకి తెస్తున్నారు.
Also Read:
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్.. ఈ సూపర్ స్కీమ్ గురించి మీకు తెలుసా..
ఆషాడ మాసం.. కొత్త కోడలిని పుట్టింటికి ఎందుకు పంపిస్తారో తెలుసా..
For More Lifestyle News