Share News

Monsoon Gardening Tips: వర్షాకాలంలో మొక్కలను ఎలా సంరక్షించాలో తెలుసా..

ABN , Publish Date - Jun 29 , 2025 | 03:15 PM

వర్షాకాలంలో మొక్కలను సంరక్షించడం చాలా ముఖ్యం. ఎందుకంటే అధిక వర్షపాతం మొక్కలకు హాని కలిగించవచ్చు. కాబట్టి..

Monsoon Gardening Tips: వర్షాకాలంలో మొక్కలను ఎలా సంరక్షించాలో తెలుసా..
Gardening Tips

Gardening Tips: వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది తమ ఇంటి ఆవరణంలో మొక్కలు నాటడానికి ఇష్టపడుతుంటారు. ఎందుకంటే, ఈ సీజన్ కొత్త మొక్కలు నాటడానికి చాలా అనువుగా ఉంటుంది. ఈ కాలంలో మొక్కలు పచ్చగా ఉండటంతో పాటు వేగంగా పెరుగుతాయి. అదే సమయంలో కొన్నిసార్లు అధిక వర్షపాతం మొక్కలకు హాని కలిగించవచ్చు. కాబట్టి, మొక్కలను జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే మొక్కల వేర్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. అలాగే ఆకులపై బూజు కూడా వస్తుంది. కాబట్టి, ఈ సులభమైన చిట్కాల ద్వారా మొక్కలను జాగ్రత్తగా పెంచండి.


బూజు తెగులు

వర్షాకాలంలో ఎక్కువ నీరు ఆకులపై బూజు పెరగడానికి కారణమవుతుంది. దీనివల్ల మొక్కలు చెడిపోతాయి. కాబట్టి, మీరు మొక్కలపై వేప నూనెను పిచికారీ చేయవచ్చు. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్‌ను నివారిస్తుంది. అలాగే, వర్షాకాలంలో కుండలో నీటిని నింపడం మొక్కలకు హానికరం. నీరు నిలిచిపోవడం వల్ల వేర్లు కుళ్ళిపోవచ్చు. కాబట్టి, మొక్కలకు ఎక్కువ నీరు పోయకండి. తద్వారా మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి మొక్కల ఆకులు, కాండాలను తనిఖీ చేయండి. ఏదైనా ఆకుపై బూజు కనిపిస్తే దానిని వెంటనే తొలగించండి.


అధిక ఎరువులు హానికరం

వర్షాకాలంలో చాలా మంది మొక్కలకు ఎక్కువ ఎరువులు వేస్తారు. అయితే, ఇది మొక్కకు హాని కలిగించవచ్చు. కాబట్టి, ఈ సీజన్‌లో పరిమిత మొత్తంలో కంపోస్ట్ వేయడం మంచిది.

మొక్కలను ఎండలో ఉంచండి

వర్షాకాలంలో మొక్కలను పరిమిత సమయం పాటు ఎండలో ఉంచండి. ఎందుకంటే, కొన్ని మొక్కలకు పూర్తి సూర్యరశ్మి అవసరం. మరికొన్నింటికి పాక్షిక సూర్యరశ్మి లేదా నీడ అవసరం. మొక్కకు సరిపడా సూర్యరశ్మి లేకపోతే అది సరిగా పెరగదు లేదా చనిపోతుంది. అదేవిధంగా, మొక్కకు మరీ ఎక్కువ సూర్యరశ్మి ఉంటే అది ఎండిపోయే ప్రమాదం ఉంటుంది.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Also Read:

తరచుగా ఆవలిస్తుంటే జాగ్రత్త.. మీ శరీరం చెప్పే ఆరోగ్య సంకేతాలు ఇవే!

మీరు ఆఫీస్‌కి వెళ్తారా..? తాజా సర్వేలో సంచలన విషయాలు..

For More Health News

Updated Date - Jun 29 , 2025 | 05:11 PM