Kitchen Tips: కిచెన్ సింక్‌ని శుభ్రంగా ఉంచే సింపుల్ టిప్స్.. ఇలా క్లీన్ చేస్తే చాలు..
ABN , Publish Date - Jun 24 , 2025 | 01:17 PM
కిచెన్ సింక్ నుండి దుర్వాసన వస్తోందా? ఇంట్లో సింక్ వాసనకు చెక్ పెట్టడానికి ఇబ్బంది పడుతున్నారా? అయితే, ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు. కిచెన్ సింక్ పాతదైనా సరే కొత్త దానిలా మెరిసిపోతుంది. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Sink Cleaning Tips: వంటింట్లో శుభ్రత చాలా ముఖ్యం. ముఖ్యంగా కిచెన్ సింక్ నుండి దుర్వాసన రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే, దీని వల్ల ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. మీ ఇంట్లో కూడా కిచెన్ సింక్ నుండి దుర్వాసన వస్తోందా? ఇంట్లో సింక్ వాసనకు చెక్ పెట్టడానికి ఇబ్బంది పడుతున్నారా? అయితే, ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు. కిచెన్ సింక్ పాతదైనా సరే కొత్త దానిలా మెరిసిపోతుంది. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బేకింగ్ సోడా
ముందుగా ఒక కప్పు బేకింగ్ సోడాని సింక్‌లో చల్లండి. వెంటనే అర కప్పు వెనిగర్ వేయండి. కొన్ని నిమిషాల పాటు అలానే ఉండనివ్వండి. ఈ కాంబినేషన్ మురికిని తొలగించడమే కాకుండా బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తుంది. ఆ తరువాత వేడి నీళ్లతో క్లీన్ చేయండి. సింక్ దుర్వాసన పూర్తిగా పోతుంది.
నిమ్మకాయ రసం
ఒక కప్పులో నిమ్మకాయ రసం పిండి అందులో కొంచెం ఉప్పు కలిపి, స్పాంజ్‌తో సింక్ అంతా స్క్రబ్ చేయండి. ఇది సింక్‌ను శుభ్రపరుస్తుంది.
వేపాకుల నీళ్లు
కొద్దిగా వేప ఆకులను నీళ్లలో మరిగించి, ఆ నీటిని సింక్‌లో పోయండి. తర్వాత సబ్బుతో సింక్‌ను క్లీన్ చేయండి. ఇది సహజమైన యాంటీ సెప్టిక్ కాబట్టి బ్యాక్టీరియాను తొలగించి, శుభ్రం చేస్తుంది.
బ్లీచింగ్ పౌడర్
బ్లీచింగ్ పౌడర్‌ను వేడి నీటిలో కలిపి సింక్‌లో పోస్తే దుర్వాసన మాయం అవుతుంది. ఇది ఒక రసాయన పద్ధతి అయినా సరే తక్కువ మోతాదులో వాడితే ప్రమాదం ఉండదు. తరువాత శుభ్రంగా క్లీన్ చేయాలి.
రోజూ క్లీన్ చేయండి
వంట తర్వాత మిగిలిన ఆహారపు చెత్తను వెంటనే తీసివేయండి. రోజుకి కనీసం ఒక్కసారి వేడి నీటిని సింక్‌లో పోయడం అలవాట్లు చేసుకోండి. ఇలా చేస్తే దుర్వాసన సమస్య ఉండదు. ఈ విధంగా సహజ మార్గాలను పాటిస్తే, మీ కిచెన్ సింక్ ఎప్పుడూ కొత్తదానిలా మెరిసిపోతుంది. రసాయనాలు లేకుండా శుభ్రతను కాపాడటం వల్ల ఆరోగ్యానికి మేలు కూడా జరుగుతుంది. ఒక్కసారి ఈ పద్ధతులను ట్రై చేసి చూడండి. ఫలితాలు మీకే కనిపిస్తాయి.
Also Read:
ఫ్రిజ్‌లో ఐస్ పేరుకుపోతుందా.. ఈ చిట్కాలు మీకోసం..
ప్రేమలో ఉన్న అమ్మాయిలు ఎక్కువగా చేసే తప్పులు ఇవే.. మీరు కూడా చేస్తుంటారా..
For More Lifestyle News