Share News

Gas Stove Burner: గ్యాస్ స్టవ్‌పై నల్లటి మరకలు ఉంటే.. ఇలా చేస్తే తెల్లగా అవుతుంది!

ABN , Publish Date - Apr 25 , 2025 | 05:01 PM

Gas Stove Burner: గ్యాస్ స్టవ్‌పై నల్లటి మరకలు ఉంటే.. గ్యాస్ బర్నర్లను మిల మిల మెరిసిపోయేలా చేయాలంటే.. ఈ విధంగా చేయాలి.

Gas Stove Burner: గ్యాస్ స్టవ్‌పై నల్లటి మరకలు ఉంటే.. ఇలా చేస్తే తెల్లగా అవుతుంది!

గ్యాస్ స్టవ్‌, బర్నర్‌లను శుభ్రం చేయడానికి వెనిగర్,బేకింగ్ సోడా,నిమ్మకాయతోపాటు ఉప్పును ఉపయోగించాల్సి ఉంటుంది. దీనివల్ల బర్నర్‌లు సులభంగా మెరుస్తాయి.ఈ చిట్కాలను ఉపయోగించడం ద్వారా గ్యాస్ ఆదా చేయవచ్చు.

గతంలో కట్టెల పొయ్యిలు, పంపు పొయ్యిలపై వంట చేసేవారు. కానీ గ్యాస్ స్టవ్ మీద వంట చేయడం చాలా సులభం. కాబట్టి ప్రస్తుతం ప్రతి ఇంట.. వంటగదిలో గ్యాస్ స్టవ్ ఉంటుంది. దాదాపు ప్రతి వంట పనికి గ్యాస్ స్టవ్‌లను తరచుగా ఉపయోగిస్తారు. దీని వలన స్టవ్‌తోపాటు బర్నర్లు సైతం నల్లగా మారుతాయి.

gas-01.jpg

అంతేకాదు.. బర్నర్ల రంధ్రాలు కూడా మూసుకుపోతాయి. దీనికి చాలా గ్యాస్ ఖర్చవుతుంది. అలాంటి గ్యాస్ బర్నర్లను శుభ్రం చేయడానికి చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. కానీ మీరు.. ఈ చిట్కాలను పాటిస్తే.గ్యాస్ బర్నర్లు కొన్ని నిమిషాల్లోనే తళ తళా మెరుస్తాయి. అందుకోసం మీరు కష్టపడాల్సిన అవసరం లేదు.

gas-02.jpg


మరి ఆ ఉపాయాలు ఏమిటో తెలుసుకుందాం.

గ్యాస్ బర్నర్లను శుభ్రం చేయడానికి వెనిగర్ ఉపయోగించవచ్చు. వెనిగర్ గ్యాస్ బర్నర్లను కొన్ని నిమిషాల్లో‌నే శుభ్రపరుస్తుంది. అందుకోసం.. ఒక టబ్ తీసుకుని దానిలో వెనిగర్ వేయండి. తర్వాత నీళ్లు పోసి గ్యాస్ బర్నర్లను 5 నిమిషాలు అందులో నానబెట్టాలి. ఆ తర్వాత పొడి గుడ్డతో వాటిని తుడవాలి. ఇలా చేయడం వల్ల బర్నర్ శుభమవుతాయి.

gas-05.jpg

గ్యాస్ బర్నర్లను శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా, నిమ్మకాయను ఉపయోగించవచ్చు. రెండింటినీ బాగా కలిపి దాదాపు 20 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత బ్రష్ సహాయంతో గ్యాస్ బర్నర్లను శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల బర్నర్ల రంధ్రాలు తెరుచుకుంటాయి. తర్వాత బర్నర్‌ను వేడి నీటిలో 5 నిమిషాలు అలాగే ఉంచి..ఆపై ఒక గుడ్డ తీసుకొని తుడవండి. ఇలా చేయడం వల్ల నిమిషాల్లో బర్నర్ శుభ్రం అవుతుంది.

gas-04.jpg


వెనిగర్, ఉప్పు ఉపయోగించి గ్యాస్ బర్నర్లను శుభ్రం చేయవచ్చు. ఈ రెండింటినీ బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి 10 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తరువాత ఒక గుడ్డతో వాటిని శుభ్రం చేయండి. అప్పుడు మీరు గ్యాస్ బర్నర్లను చూసినప్పుడు..అవి శుభ్రంగా ఉన్నాయని మీకు తెలుస్తుంది.

gas03.jpg

మీరు నిమ్మకాయ, ఉప్పు ఉపయోగించి గ్యాస్ బర్నర్లను శుభ్రం చేయవచ్చు. దీని కోసం నిమ్మకాయను ముక్కలుగా కోయండి. తర్వాత వాటిపై ఉప్పు చల్లి బర్నర్ మీద రుద్దండి. తరువాత గోరువెచ్చని నీటిలో 5 నిమిషాలు ఉంచండి. ఇలా చేస్తే.. మీరు నిమిషాల్లో నల్లబడిన బర్నర్లను శుభ్రం చేయవచ్చును.

Updated Date - Apr 25 , 2025 | 05:02 PM