Share News

Tips To Clean Kitchen Tiles: కిచెన్ టెయిల్స్‌పై మరకలు పేరుకుపోయయా? కేవలం 5 నిమిషాల్లో..

ABN , Publish Date - Jul 15 , 2025 | 11:45 AM

కిచెన్ టైల్స్ పై ఉన్న మరకలు ఇంటి శుభ్రతను పాడు చేస్తాయి. అయితే, కేవలం 5 నిమిషాల్లో మీ వంటగది టైల్స్ మళ్ళీ కొత్తగా మెరిసేలా చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

Tips To Clean Kitchen Tiles:  కిచెన్ టెయిల్స్‌పై మరకలు పేరుకుపోయయా? కేవలం 5 నిమిషాల్లో..
Kitchen Tiles

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం అనేది చాలా మందికి ఒక పెద్ద సవాలు. కొంత మందికి ఇంటిని శుభ్రంగా ఉంచడానికి తగినంత సమయం ఉండదు. మరికొందరికి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ఎలాగో తెలియదు. ముఖ్యంగా వంటగది విషయానికి వస్తే, ఇక్కడ శుభ్రం చేయడానికి చాలా సమయం పడుతుంది. వంటగదిలో సుగంధ ద్రవ్యాల వాసనతో పాటు టైల్స్‌పై నూనె వంటి జిడ్డు మరకలు కూడా పేరుకుపోతాయి. ఇది క్రమంగా పసుపు రంగులోకి మారుతుంది. కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా ఆ మరకలు, జిడ్డు పోనట్లు అనిపిస్తుంది. అయితే, కేవలం 5 నిమిషాల్లో మీ వంటగది టైల్స్ మళ్ళీ కొత్తగా మెరిసేలా చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..


బేకింగ్ సోడా, వెనిగర్

కిచన్ టైల్స్‌ కోసం.. బేకింగ్ సోడా, వెనిగర్ ఉపయోగించడం అత్యంత సులభమైన, ప్రభావవంతమైన మార్గం. ఒక గిన్నెలో 2 టీస్పూన్ల బేకింగ్ సోడా, 2 టీస్పూన్ల వెనిగర్ కలపండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను టైల్స్‌పై గ్రీజు లేదా మరకలు ఉన్న చోట అప్లై చేయండి. 5- 10 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత పాత టూత్ బ్రష్ లేదా చిన్న బ్రష్‌తో సున్నితంగా స్క్రబ్ చేయండి. దీని తర్వాత, శుభ్రమైన తడి గుడ్డతో తుడవండి. అవసరమైతే నీటితో కడగండి. మీ టైల్స్ కొద్దిసేపటికే మళ్లీ మెరుస్తాయి.

వేడి నీరు, డిటర్జెంట్

కిచన్ టైల్స్ క్లీన్ చేయడం కోసం ఒక పాత్రలో నీటిని బాగా వేడి చేయండి. దానికి కొంత డిటర్జెంట్ పౌడర్ వేసి కలపండి. ఇప్పుడు ఈ నీటిని టైల్స్ పై స్పాంజితో అప్లై చేయండి. మురికి మృదువుగా అయ్యేలా 10 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత స్క్రబ్బర్ లేదా స్పాంజితో శుభ్రం చేసి శుభ్రమైన గుడ్డతో తుడవండి.


ప్రతిరోజూ తేలికగా శుభ్రపరచండి

మీ వంటగది టైల్స్ తరచుగా మురికిగా ఉండకూడదనుకుంటే, ప్రతిరోజూ కేవలం 2 నిమిషాలు సమయం తీసుకుని వంట చేసిన తర్వాత, శుభ్రమైన లేదా కొద్దిగా తడిగా ఉన్న గుడ్డతో టైల్స్‌ను తుడవండి. ఇది తాజా మరకలను వెంటనే తొలగిస్తుంది. ఇలా చేయడం వల్ల మరకలు పేరుకుపోయే అవకాశం ఉండదు.

మరికొన్ని చిట్కాలు

నిమ్మరసం.. టైల్స్ నుండి మురికిని తొలగించడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మీకు కావాలంటే, నిమ్మకాయను నేరుగా టైల్స్ పై రుద్ది, ఆపై శుభ్రం చేయండి. మీరు టైల్స్ పై ఉప్పు, కొద్దిగా వెనిగర్ మిశ్రమాన్ని కూడా పూయవచ్చు. ఇది క్రమంగా పాత మరకలను తొలగిస్తుంది. వంటగది టైల్స్ శుభ్రంగా ఉంచుకోవడం కేవలం ప్రదర్శన కోసం మాత్రమే కాదు. మీ ఇంటి పరిశుభ్రత, ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యం.


Also Read:

చెప్పులు ఎంత కాలం తర్వాత మార్చాలి.. వాటిని మార్చకపోతే..

బాత్రూం క్యాంపింగ్.. జెన్ జీలో పెరిగిపోతున్న నయా ట్రెండ్..

For More Lifestyle News

Updated Date - Jul 15 , 2025 | 11:46 AM