Share News

Friendship Day: ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్.. ఎంజాయ్ చేయడానికి హైదరాబాద్‌లోని బెస్ట్ ‌ప్లేసులు ఏవో తెలుసా?

ABN , Publish Date - Aug 02 , 2025 | 07:57 PM

ఫ్రెండ్‌షిప్ డేని మరింత స్పెషల్‌గా చేసుకోవడానికి మీ స్నేహితులతో కలిసి సరదాగా బయటకు వెళ్లి టైం స్పెండ్ చేయండి. అంటే ఎక్కడికి వెళ్లాలని ఆలోచిస్తున్నారా?

Friendship Day: ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్..  ఎంజాయ్ చేయడానికి హైదరాబాద్‌లోని బెస్ట్ ‌ప్లేసులు ఏవో తెలుసా?
Friendship Day

ఇంటర్నెట్ డెస్క్‌: ఫ్రెండ్‌షిప్ డేని మరింత స్పెషల్‌గా చేసుకోవడానికి మీ స్నేహితులతో కలిసి సరదాగా బయటకు వెళ్లి టైం స్పెండ్ చేయండి. అంటే ఎక్కడికి వెళ్లాలని ఆలోచిస్తున్నారా? మీ స్నేహితులతో కలిసి చారిత్రక ప్రదేశాలు లేదా ఫన్ అండ్ రిలాక్సేషన్ ప్లేసులకు వెళ్లి సరదాగా గడపాలనుకుంటే హైదరాబాద్ చుట్టూ చాలా మంచి ప్లేసులు ఉన్నాయి. ఇక లేట్ చేయకుండా ఎక్కడికి వెళ్తే బాగుంటుందో ఈ కింది ఆప్షన్స్ చూసి సెలక్ట్ చేసుకుని అక్కడికి వెళ్లి బాగా ఎంజాయ్ చేయండి..


చారిత్రక & సాంస్కృతిక ప్రదేశాలు:

చార్మినార్: హైదరాబాద్ చిహ్నంగా నిలిచిన ఈ చారిత్రక స్థలం ఫోటోలు తీయడానికి చాలా బావుంటుంది.

గోల్కొండ కోట: పురాతన కోట, ఆకట్టుకునే నిర్మాణం, చరిత్రను స్నేహితులతో కలిసి అన్వేషించేందుకు అద్భుతమైన స్థలం.

సాలార్ జంగ్ మ్యూజియం: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళా వస్తువులని చూసి ఆశ్చర్యపోవచ్చు.

చౌమహల్లా ప్యాలెస్: నిజాం కాలంలోని రాజసము చూడాలంటే తప్పక వెళ్ళాలి.

ఫలక్‌నుమా ప్యాలెస్: లగ్జరీ అనుభూతిని ఇచ్చే రాయల్ ప్యాలెస్. అవసరమైతే ముందే బుకింగ్ చేసుకోండి.


ఫన్ & రిలాక్సింగ్ ఆప్షన్స్:

రామోజీ ఫిల్మ్ సిటీ: ఒకరోజు మొత్తం సరదాగా గడిపేందుకు బెస్ట్ ప్లేస్. షోలు, సెట్స్, గేమ్స్ అన్నీ కలిపి చాలా ఎంజాయ్ చేయొచ్చు.

శిల్పారామం: కళలు, హ్యాండీక్రాఫ్ట్స్, సాంస్కృతిక ప్రదర్శనలతో పక్కా రిలాక్సింగ్ వాతావరణం.

ఇనోర్బిట్ మాల్: షాపింగ్, సినిమాలు, ఫుడ్ కోర్ట్. ఒకే చోట మీకు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్.

కేఫ్‌లు: హాయిగా కూర్చుని మాట్లాడుకోవాలంటే మంచి కేఫ్‌లో కలవండి.

చిన్న రోడ్ ట్రిప్ ప్లాన్ల కోసం:

నాగార్జునసాగర్: డ్యామ్, బోటింగ్, ఏసియాలో పెద్ద బౌద్ధ స్థలాల్లో ఒకటైన నాగార్జునకొండ సందర్శించవచ్చు.


Also Read:

వర్షాకాలంలో ఒక్కసారైనా చూడాల్సిన అందమైన టూరిస్టు ప్రదేశాలు ఇవే..

లంచ్ చేసుకోవడానికి టైం ఉండట్లేదా.. 5 ఫాస్ట్ రెసిపీ ఐడియాస్ మీకోసమే..

For More Lifestyle News

Updated Date - Aug 02 , 2025 | 08:05 PM