Tips To Store Salt: స్టీల్ పాత్రలలో ఉప్పు నిల్వ చేస్తున్నారా? జాగ్రత్త.!
ABN , Publish Date - Jul 30 , 2025 | 03:33 PM
మనం తరచూ ఉప్పును స్టీల్ డబ్బాలలో నిల్వ చేస్తూ ఉంటాం. అయితే, ఇలా చేయడం మంచిదేనా? ఈ విషయం గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

ఇంటర్నెట్ డెస్క్: ఉప్పు లేకుండా వంట రుచి అసంపూర్ణంగా ఉంటుంది. ఆహారానికి రుచిని ఇవ్వడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అది లేకుంటే వంటలు రుచిగా ఉండవు. ఉప్పు వంటకాల రుచిని పెంచడమే కాకుండా, శరీరానికి కూడా అవసరమైన ఖనిజాలను అందిస్తుంది. శరీరంలోని ద్రవాల సమతుల్యతను కాపాడుతుంది. నరాల, కండరాల పనితీరుకు సహాయపడుతుంది. కొన్ని పోషకాలను శోషించడంలో ఉపయోగపడుతుంది. ఉప్పు లేకుండా వంట రూచి అసంపూర్ణం అయితే, అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరగడం, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం.
మనం తరచూ ఉప్పును ఉక్కు (స్టీల్) డబ్బాలలో నిల్వ చేస్తూ ఉంటాం. కానీ, నిజానికి ఇది మంచి అలవాటు కాదు. ఎందుకంటే ఉప్పు తేమను పీల్చుకునే లక్షణం కలిగి ఉండటంతో, అది ఉక్కుతో కలిసి కొన్ని సమస్యలు కలిగిస్తుంది. స్టీల్ పాత్రలో ఉప్పు ఉంచితే అది గడ్డ కడుతుంది. అప్పుడు దానిని ఉపయోగించలేం. స్టీల్ పాత్రలో ఉప్పు నిల్వ చేయడం వలన ఉప్పు రుచి మారవచ్చు. అంతేకాకుండా, దాని నాణ్యత కూడా దెబ్బతింటుంది.
స్టీల్ పాత్రలలో ఉప్పు నిల్వ చేస్తే, ఉప్పులో ఉండే క్లోరైడ్ కారణంగా స్టీల్ తుప్పు పట్టే అవకాశం ఉంది. తద్వారా, తుప్పు పట్టిన స్టీల్ నుండి లోహపు కణాలు ఆహారంలో కలిసిపోయి, ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. ముఖ్యంగా ఆమ్ల పదార్థాలు లేదా ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను స్టీల్ పాత్రలలో నిల్వ చేస్తే, ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.
ఉప్పు ఎలా నిల్వ చేయాలి:
స్టీల్‌కు బదులు గాజు, సిరామిక్, ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ బాక్సులు వాడండి.
ఉప్పులో కొన్ని బియ్యం గింజలు లేదా బ్రెడ్ ముక్కను పొడి చేసి కలిపి పెట్టండి. ఇది తేమను తగ్గించడంలో సహాయపడుతుంది.
స్టవ్ దగ్గర ఉప్పును ఉంచవద్దు. ఎందుకంటే, ఆవిరి కారణంగా తేమ పెరిగిపోతుంది.
ఉప్పు వేసుకునేటప్పుడు తడి చెంచాలు వాడొద్దు. ఎప్పుడూ పొడి చెంచాతో మాత్రమే ఉప్పు తీసుకోవాలి.
గడ్డలుగా మారిన ఉప్పుతో ఏం చేయాలి?
తక్కువ మంట మీద ఉప్పును వేడి చేసి, చల్లబరిచి మళ్ళీ నిల్వ చేయండి.
మిక్సీలో వేసి మెత్తగా చేసి వాడవచ్చు.
కొత్త కంటైనర్‌లోకి ఉప్పును ఉంచి అందులో కొన్ని బియ్యం గింజలను ఉంచవచ్చు.
ఉప్పు చాలా సాధారణమైనదే అనిపించినా, దాన్ని ఎలా నిల్వ చేస్తామన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే దీర్ఘకాలంలో ఆరోగ్యం, రుచి, వస్తువుల స్థితిపై ప్రభావం చూపుతుంది. అందుకే ఉక్కు పాత్రలలో ఉప్పు నిల్వ చేయడం మంచిది కాదు. మంచి రుచి, ఆరోగ్యం కోసం సరైన నిల్వ విధానాలు పాటించండి. ఉప్పును గాజు లేదా సిరామిక్ పాత్రలలో నిల్వ చేయడం మంచిది.
ఇవి కూడా చదవండి:
అల్యూమినియం పాత్రల్లో ఇన్నేళ్లకు మించి వండితే కిడ్నీ సమస్యలు..!
హైదరాబాద్ సమీపంలో అద్భుత జలపాతం.. వర్షాకాలంలో అస్సలు మిస్సవకండి.
Also Read Lifestyle News