Kadi In Monsoon: వర్షాకాలంలో కధి తినకూడదా? ఆయుర్వేదం చెప్పే కారణాలు ఇవే.!
ABN , Publish Date - Jul 19 , 2025 | 02:25 PM
ఆయుర్వేదం ప్రకారం, వర్షాకాలంలో కధి తినకూడదు. అయితే, కధి ఎందుకు తినకూడదు? ఆయుర్వేదం చెప్పే కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంటర్నెట్ డెస్క్: ఆహారపు అలవాట్ల విషయంలో ఆయుర్వేదం కొన్ని సీజన్‌లకు ప్రత్యేకమైన సూచనలు చేస్తుంది. వర్షాకాలంలో పలు రకాల ఆహారాలను తినకూడదని హెచ్చరిస్తుంది. అందులో ముఖ్యమైనది కధి. దీనిని పెరుగు, శెనగపిండితో పాటు కొన్ని మసాలాలు ఉపయోగించి చేస్తారు. అయితే, ఆయుర్వేదం ప్రకారం, వర్షాకాలంలో కధి తినకూడదు. కధి ఎందుకు తినకూడదు? ఆయుర్వేదం చెప్పే కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కధి శీతలాహారంగా పని చేస్తుంది. వర్షాకాలంలో శరీరానికి వెచ్చని ఆహారం అవసరం. కానీ కధి చల్లదనాన్ని కలిగించే ఆహారం కాబట్టి, ఈ కాలంలో శరీరానికి ఉపయోగపడదు. దీనివల్ల జీర్ణ సమస్యలు, శరీర అసమతుల్యత వచ్చే అవకాశముంది. జీర్ణానికి ఇబ్బంది కలగవచ్చు. కధిలో ఉండే పెరుగు, శనగపిండి వర్షాకాలంలో సులభంగా జీర్ణం కావు. ఆయుర్వేదం ప్రకారం, ఈ కాలంలో జీర్ణశక్తి బలహీనంగా ఉంటుంది. అందువల్ల అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు రావచ్చు.
ఆయుర్వేదం ప్రకారం, శరీరంలో వాత, పిత్త, కఫ అనే మూడు దోషాలు సమతుల్యంలో ఉండాలి. వర్షాకాలంలో ఇవి అసమతుల్యంలోకి వెళ్లే ప్రమాదం ఎక్కువ. కధి వలన ఈ దోషాలు మరింతగా కదలికకు గురవుతాయని భావిస్తారు. వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటంతో పెరుగు త్వరగా పాడవుతుంది. దీంతో ఆహారం ద్వారా బ్యాక్టీరియా శరీరంలోకి వచ్చి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ఆయుర్వేదం ప్రకారం, ఈ కాలంలో పులియబెట్టిన ఆహారాలను తినకూడదు. కాబట్టి, పులియబెట్టిన ఆహారాలకు దూరంగా ఉండాలి.
Also Read:
పప్పులోని పోషకాలు అందాలంటే.. తప్పనిసరిగా ఇలా చేయండి.!
బియ్యం కడగకుండా వండితే ఏమవుతుందో తెలుసా?