Egg Boil Tips: గుడ్డు పగలకుండా ఎలా ఉడకబెట్టాలి?
ABN , Publish Date - Jul 23 , 2025 | 02:03 PM
కొన్నిసార్లు గుడ్లు ఉడకబెట్టేటప్పుడు పగిలిపోతాయి. అయితే, ఇలా గుడ్డు పగలగుండా ఉండటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంటర్నెట్ డెస్క్: గుడ్లు పోషకాల గని. ఇవి ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలకు గొప్ప మూలం. గుడ్లలో విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె, బి విటమిన్లు, ఐరన్, జింక్, సెలీనియం, కోలిన్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుడ్లలో అధిక నాణ్యత గల ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాల పెరుగుదలకు, కంటి ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి, బరువు నిర్వహణకు సహాయపడుతుంది.
చాలా మంది అల్పాహారంగా ఎగ్ బ్రెడ్, లేదా ఉడికించిన గుడ్డు తినడానికి ఇష్టపడతారు. ప్రోటీన్ అధికంగా ఉండే గుడ్లు ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. ప్రతిరోజూ ఒక గుడ్డు తినడం వల్ల రోజంతా శక్తితో ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. అయితే, గుడ్డును ఉడికించేటప్పుడు కొన్నిసార్లు పగిలిపోతాయి. దీని వల్ల, గుడ్డులోని తెల్లసొన అంతా బయటకు వస్తుంది. ఇలా పగిలిపోయిన గుడ్డును తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే అలాంటి గుడ్డుకు బ్యాక్టీరియా చేరుతుంది. దాన్ని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే, గుడ్డు పగలగుండా ఉండటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
గుడ్లను ఎలా ఉడకబెట్టాలి?
గుడ్లు ఉడకపెట్టేటప్పుడు దానిలో ఒకటి నుండి రెండు టేబుల్ స్పూన్ల తెల్ల వెనిగర్ జోడించాలి. మీ దగ్గర వెనిగర్ లేకపోతే, నీటిలో ఒకటి లేదా అర టీస్పూన్ ఉప్పు కలపండి. ఇలా చేయడం వల్ల గుడ్డు పెంకు పగిలినా గుడ్డులోని తెల్లసొన బయటకు రాదు. అంతేకాకుండా, గుడ్లను మీడియం మంటపై ఉడకబెట్టండి. అధిక మంట మీద ఉడికించడం వల్ల గుండ్లు పగిలిపోవచ్చు.
దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!