Best Summer Spots: ఇండియా ది బెస్ట్ సమ్మర్ డెస్టినేషన్స్ ఇవే.. కూల్ కూల్‌గా ఎంజాయ్ చేయండి..
ABN , Publish Date - Apr 10 , 2025 | 08:47 PM
Best Summer Vacations In India: వేసవి వేడి నుంచి తప్పించుకుని చల్లటి ప్రదేశాల్లో గడపాలని ప్లాన్ చేస్తున్నారా.. అందుకోసం మన దేశంలోనే కొన్ని అద్భుతమైన ప్రదేశాలున్నాయి. పర్యాటకులకు ఈ ప్రాంతాలు స్వర్గం కంటే తక్కువ కాదు.

Top Summer Holiday Destinations In India: భారతదేశంలో వేసవి సెలవులను ఆస్వాదించడానికి అద్భుతమైన ప్రదేశాలున్నాయి. సూర్యుడి వేడికి దూరంగా ప్రకృతి దగ్గరగా ఈ చల్లని ప్రాంతాల్లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కపుల్స్ ఇలా ఎవరితో కలిసి వెళ్లినా ఫుల్ గా ఎంజాయ్ చెయ్యెచ్చు. పచ్చదనంతో మెరిసి పోయే కొండలు, ఆహ్లాదకరమైన బీచ్ లు, సాహస క్రీడలతో నిండిన కొన్ని టాప్ సమ్మర్ డెస్టినేషన్స్ లిస్ట్ మీకోసం..
మున్నార్
మార్చి-జూన్ మధ్య మున్నార్ లో టీ ఎస్టేట్స్, ఎరావికులం నేషనల్ పార్క్, మట్టుపెట్టి డ్యామ్ లో బోటింగ్ , అనైముడి పర్వతంపైకి ట్రెక్కింగ్, టాప్ హిల్ స్టేషన్ తప్పక చూడదగ్గ ప్రాంతాలు. ఈ సమయంలో కూడా ఇక్కడ చల్లటి వాతావరణం, పొగ మంచు, పచ్చటి కొండలు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తాయి.
యేర్కాడ్
చుట్టూ తోటల నడుమ యేర్కాడ్ లేక్ లో బోటింగ్, సూర్యాస్తమయ దృశ్యాలకు ప్రసిద్ధి చెందిన లేడీస్ సీట్, షెవరాయ్ కొండలపై అద్భుతమైన రాతి నిర్మాణాలకు పేరొందిన పగోడా పాయింట్, పచ్చని అడవుల మధ్య ఉండే కిలియూర్ జలపాతం, అరుదైన మొక్కలు, ఆర్కిడ్ లతో నిండి ఉండే బొటానికల్ గార్డెన్ ప్రకృతి ప్రేమికులను మరో లోకంలోకి తీసుకెళతాయి.
ఊటీ
ఊటీ లేక్ బోటింగ్, సైక్లింగ్ లకు అనువైన చల్లని సరస్సు. నీలగిరి కొండల్లో ఎత్తైన ప్రదేశంగా పేరొందిన దొడ్డబెట్ట శిఖరం, బొటానికల్ గార్డెన్స్, టీ గార్డెన్స్ సౌందర్యం, వందల రకాల గులాబీలు ఉండే రోజ్ గార్డెన్ అత్యద్భుతంగా ఉంటాయి.
మహాబలేశ్వర్
మహాబలేశ్వర్ లో వెన్నా లేక్ బోటింగ్, గుర్రపు స్వారీకి అనువైన ప్రాంతం. చారిత్రక కోట ప్రతాప్ గఢ్ ఫోర్ట్ అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రతీక. కొండలు, లోతైన లోయల సౌందర్యానికి ప్రసిద్ధి పొందిన ఎలిఫెంట్ పాయిట్, లింగమల జలపాతం, స్ట్రాబెరీ తోటలకు నిలయమైన మ్యాపిల్ వ్యాలీ సూర్యోదయ దృశ్యాలు పర్యాటకులను తప్పక అలరిస్తాయి.
కూర్గ్
వేసవిలో కూర్గ్ లేదా కొడగులో పచ్చని అడవుల మధ్య ఉండే అబ్బి ఫాల్స్ లో గడిపితే ఒత్తిడి దూరమవుతుంది. రాజా సీట్ లో తోటలు, సూర్యాస్తమయ దృశ్యాలు, కావేరి జన్మస్థలం తల కావేరి, ఆధ్యాత్మిక, ప్రకృతి సౌందర్యానికి నిదర్శనం. ఇంకా మడికేరి ఫారెస్ట్, దుబారే క్యాంప్ వద్ద ఏనుగులతో సమయం గడపడం, నది వద్ధ స్నానం చేయిస్తుంటే చూడటం చాలా బావుంటుంది.
మనాలి
మనాలిలో రోహ్ టాంక్ పాస్ హిమాలయ మంచు పర్వత దృశ్యాలు, మంచుతో కప్పబడిన రోడ్లు, సాహస క్రీడలు ప్రసిద్ధి. సంప్రదాయ గ్రామ వాతావరణం, కేప్ లు, చిన్న షాపులతో ఓల్డ్ మనాలి ఆహ్లాదకరంగా ఉంటుంది. సోలాంగ్ వ్యాలీలో పారా గ్లైడింగ్, జోర్బింగ్ వంటి సాహసాలు, చెక్కతో నిర్మించిన హడిమ్బా టెంపుల్, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన మను ఆలయం వేసవిలో చూడదగ్గ ప్రదేశాలు.
కాశ్మీర్
కాశ్మీర్ లోని శ్రీనగర్-దాల్ లేక్ లో తామర తోటల మధ్య శికారా బోట్ రైడింగ్ మధురానుభూతులు పంచుతుంది. గుల్మార్గ్ కొండలు స్కీయింగ్, గండోలా రైడ్ కు ప్రసిద్ధి. పహల్గామ్ లోని బీటా వ్యాలీ, లిడ్డర్ నది వద్ద ప్రశాంతత ఒత్తిడిని మటుమాయం చేస్తుంది. మెడో ఆఫ్ గోల్డ్ అని పిలిచే సోన్మార్గ్ లో హిమానీనదాలు, గుర్రపు స్వారీ సరదాగా ఉంటుంది.
లేహ్
లేహ్ లో థిక్సేమొనాస్టరీ హిమాలయ పర్వాతాల నడుమ ఉండే అందమైన బౌద్ధాలయం. వాహనాలు స్వయంగా కదిలినట్టు అనిపించే మాగ్నెటిక్ హిల్, లేహ్ నుంచి 160 కి.మీ. దూరంలో ఉండే పాంగాంగ్ సరస్సు, ఎడారి, ఇసుక దిబ్బలు,ఒంటె సవారీలకు ప్రసిద్ధి గాంచిన నుబ్రా వ్యాలీ, శాంతి స్తూపం సాహస ప్రియులు, ఔత్సాహిక పర్యాటకులకు అద్భుతమైన అనుభవం అందిస్తాయి.
Read Also: Lip Health: మీ పెదాలు ఈ రంగులోనే ఉన్నాయా.. ఒకవేళ ఈ 5 లక్షణాలు ఉంటే జాగ్రత్త..
Chanakya Neeti In Telugu: జీవితంలో సక్సెస్ కావాలనుకుంటున్నారా.. ఇలా చేస్తే మీరే కింగ్..
Beauty Tips: పుట్టుమచ్చలను తొలగించడం ఎలా .. ఈ సింపు