Travel Destinations: వేసవిలో కొత్త జంటలు చూడదగ్గ.. టాప్ 5 బడ్జెట్ ఫ్రెండ్లీ హనీమూన్ స్పాట్స్..
ABN , Publish Date - Apr 04 , 2025 | 03:56 PM
Honeymoon Destinations On Budget: కొత్త జంటలకు గుడ్ న్యూస్. జీవితాంతం గుర్తుండిపోయేలా బెస్ట్ ప్లేస్‌కు హనీమూన్ ట్రిప్ వెళ్లాలని కోరుకుంటున్నారా. ఎక్కువ ఖర్చు చేయకుండానే అందమైన అనుభవాలను అందించే టాప్ -5 ఇంటర్నేషనల్ హనీమూన్ స్పాట్స్ ఇక్కడ ఉన్నాయి.

Honeymoon Destinations On Budget: కొత్త జంటలు పెళ్లి తర్వాత తమ బంధాన్ని పదిలం చేసుకునేందుకు, జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను పోగు చేసుకునేందుకు హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటారు. ఇప్పుడు సమ్మర్ కావడంతో దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ ప్రాంతాల్లో టూరిస్టుల తాకిడి అధికంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో తక్కువ ఖర్చుతోనే ఏకాంతంగా గడపగలిగే మంచి ప్రదేశానికి వెళ్లాలని కోరుకునే జంటలకు గుడ్ న్యూస్. మీరు కేవలం లక్ష రూపాయల కంటే తక్కువ ఖర్చు పెట్టి ఈ 5 దేశాల్లో హ్యాపీగా టూర్ ఎంజాయ్ చేయవచ్చు.
వేసవిలో కొత్త జంటలు ప్రశాంతంగా గడిపేందుకు ఈ 5 దేశాలు ఎంతో అనువైనవి. తక్కువ ఖర్చుతోనే ఈ మోస్ట్ రొమాంటిక్ ప్రదేశాల్లో పర్యటించి మధురానుభూతులను సొంతం చేసుకోండి.
శ్రీలంక: భారతదేశానికి పొరుగునే ఉన్న శ్రీలంక ప్రేమ జంటలకు స్వర్గధామమే. ఇక్కడి అందమైన బెంటోటా, హిరికెటియా (Hiriketiya), మిరిస్సా (Mirissa) బీచ్‌లలో నడక, సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు ఆస్వాదిస్తే వచ్చే ఫీలింగే వేరు. నువారా ఎలియాలో టీ తోటల అందాలు మిమ్మల్ని కన్నార్పనివ్వు. ఎల్లాలో ప్రకృతి మధ్య చేసే రైలు ప్రయాణం, బౌద్ధాలయాలు, పురాతన కోటలు తప్పక చూసితీరాల్సిన ప్రదేశాలు. ఏపీ నుంచి 5-6 రోజుల ట్రిప్ కోసం అయ్యే ఖర్చు
విమాన టిక్కెట్ ధర :
హైదరాబాద్ నుంచి కొలంబోకు ఎకానమీ క్లాస్‌లో ఒక్కొక్కరికి రూ.15000-రూ.20000 (ముందుగా బుక్ చేస్తే).
విజయవాడ/విశాఖపట్నం టూ కొలంబో: రూ.18,000 - రూ.25,000 (కనెక్టింగ్ ఫ్లైట్స్)
వసతి : బెంటోటా, కొలంబో, నువారా ఎలియాల్లోని 3-స్టార్ హోటళ్లలో రోజుకు రూ.1,500 - రూ.2,500. 5 రోజులకు రూ.7,500 - రూ.12,500.
ఆహారం : స్థానిక రెస్టారెంట్లలో రోజుకు ఇద్దరికీ కలిపి రూ.800 - రూ.1,200.5 రోజులకు అయితే రూ.4,000 - రూ.6,000.
టీ తోటల సందర్శనకు రూ.4,000 - రూ.8,000, స్థానిక పర్యటనలు, ట్రావెల్స్ ఖర్చులు రూ.2000-రూ.3000. శ్రీలంక భారతీయ పౌరులకు "వీసా ఆన్ అరైవల్" ఉచితంగా లేదా ఆన్‌లైన్ ETA (ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్) ద్వారా ఇస్తుంది. ఒక్కొక్కరికి రూ.1,500 - రూ.2,000.మొత్తంగా చూస్తే కనీస బడ్జెట్ రూ.50,500 - రూ.60,000. కొంచెం లగ్జరీగా అంటే బడ్జెట్ రూ.65,000 - రూ.90,000. ఆఫ్-సీజన్ (మే-జూలై)లో వెళ్తే ఖర్చు మరింత తగ్గుతుంది. ట్రావెల్ ప్యాకేజీలు ఎంచుకుంటే ఫ్లైట్, వసతి,టూర్స్ అన్ని కలిపి రూ.60,000 - రూ.80,000లు అవుతుంది.
థాయ్‌లాండ్: థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ సముద్ర తీరంలో రొమాంటిక్ డిన్నర్లు, క్రాబీలో ప్రైవేట్ ఐలాండ్స్, జేమ్స్ బాండ్ ఐలాండ్‌లో కయాకింగ్ ప్రత్యేక ఆకర్షణలు.
విమాన టిక్కెట్ ధర :
హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ ఒక్కొక్కరికి రూ.20,000-రూ.25,000 (ముందుగా బుక్ చేస్తే).
విజయవాడ/విశాఖపట్నం టూ కొలంబో: రూ.25,000 - రూ.30,000 (కనెక్టింగ్ ఫ్లైట్స్)
వసతి : ఫుకెట్, క్రాబీ, బ్యాంకాక్ లలోని 3-స్టార్ హోటళ్లలో రోజుకు రూ.2000 - రూ.3000. 5 రోజులకు రూ.10,000 - రూ.15,000.
ఆహారం : స్థానిక రెస్టారెంట్లలో రోజుకు ఇద్దరికీ కలిపి రూ.1000 - రూ.1,500.5 రోజులకు అయితే రూ.5,000 - రూ.7,500.
స్థానిక పర్యటనలు, ట్రావెల్స్ ఖర్చులు రూ.2000-రూ.3000. థాయ్‌లాండ భారతీయ పౌరులకు "వీసా ఆన్ అరైవల్" ఉచితంగా ఇస్తుంది. లేకపోతే ఒక్కొక్కరికి రూ.2వేలు ఖర్చవుతుంది. పూర్తి బడ్జెట్ ఖర్చు: రూ.70,000 నుంచి రూ.1,00,000.
నేపాల్: హిమాలయ దేశం నేపాల్ రాజధాని కాఠ్‌మండూ, పోఖరాలో వేసవిలో తెల్లని మంచు పర్వతాల మధ్య గడపడం మర్చిపోలేని అనుభూతిని పంచుతుంది. కపుల్స్ వరల్డ్ పీస్ పగోడాలో హైకింగ్, దేవీస్ ఫాల్ వద్ద అడ్వెంచర్స్ చేసి హనీమూన్ ట్రిప్ ఆస్వాదించవచ్చు.
విమాన టిక్కెట్ ధర : ఒక్కొక్కరికీ రూ.15వేలు-రూ.20వేలు
వసతి : రోజుకు రూ.2000 - రూ.5000.
ఆహారం : స్థానిక రెస్టారెంట్లలో రోజుకు ఇద్దరికీ కలిపి రూ.1000 - రూ.2000.
స్థానిక పర్యటనలు, ట్రావెల్స్ ఖర్చులు రూ.2000-రూ.3000. పూర్తి బడ్జెట్ ఖర్చు: రూ.80,000 నుంచి రూ.1,20,000.
భూటాన్: భూటాన్ దేశంలో పారో, థింఫులోని ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి అందాలు కొత్త జంటలను మైమరిపిస్తాయి. టైగర్స్ నెస్ట్ మొనాస్టరీ, పారో వ్యాలీ, బుద్ధ దోర్దెన్మా వంటి ప్రాంతాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ ఒక రోజు ఉన్నందుకు టూరిస్టులు వీసా ఫీజు కింద రూ.100 లు చెల్లించాలి.
విమాన టిక్కెట్ ధర : ఒక్కొక్కరికీ రూ.12వేలు-రూ.20వేలు
వసతి : రోజుకు రూ.2000 - రూ.6000.
ఆహారం : స్థానిక రెస్టారెంట్లలో రోజుకు ఇద్దరికీ కలిపి రూ.1500 - రూ.2500.
స్థానిక పర్యటనలు, ట్రావెల్స్ ఖర్చులు రూ.2500-రూ.4000. పూర్తి బడ్జెట్ ఖర్చు: రూ.65,000 నుంచి రూ.85,000.
బాలి : ఇండోనేషియా ఉన్న బాలి కొండలు పచ్చటి దుప్పటి కప్పుకున్నట్టుగా ఉండి కనులకు విందు చేస్తాయి. ఇక్కడ బీచ్‌లు, ఆలయాలు, నుసా దువా బీచ్‌లో వాటర్ స్పోర్ట్స్, సెమిన్యాక్‌లో సన్‌సెట్ డిన్నర్స్,వాయిస్ ఫారెస్ట్, ఉబుడ్ రైస్ టెర్రసెస్ కపుల్స్ భలేగా ఎంజాయ్ చేయవచ్చు.
విమాన టిక్కెట్ ధర : ఒక్కొక్కరికీ రూ.40వేలు-రూ.60వేలు
వసతి : రోజుకు రూ.2000 - రూ.5000.
ఆహారం : స్థానిక రెస్టారెంట్లలో రోజుకు ఇద్దరికీ కలిపి రూ.500 - రూ.1000.
స్థానిక పర్యటనలు, ట్రావెల్స్ ఖర్చులు రూ.500-రూ.1500. పూర్తి బడ్జెట్ ఖర్చు: రూ.80,000 నుంచి రూ.1,30,000.
Read Also : No Visa: వీసా లేకుండా.. ఇండియన్ పాస్ పోర్ట్‌తో 62 దేశాలు చుట్టేయచ్చు | 62 ...
Prevent Travel Sickness: ప్రయాణంలో వాంతులా.. ఇలా చేయండి చాలు ...
కారు యాక్సిడెంట్.. గుడిసెలో ఉన్న గర్భిణికి సుఖ ప్రసవం