Women Divorce Reasons: మహిళలు విడాకులు తీసుకోవడానికి కారణాలు ఇవే..
ABN , Publish Date - Jun 14 , 2025 | 12:17 PM
భారతదేశంలో ముఖ్యంగా పెద్ద నగరాల్లో విడాకుల సంఖ్య పెరుగుతోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Women Divorce Reasons: భారతదేశంలో ముఖ్యంగా పెద్ద నగరాల్లో విడాకుల సంఖ్య పెరుగుతోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. సమాజంలో వస్తున్న మార్పులు, వ్యక్తిగత ఆనందానికి ప్రాధాన్యత పెరగడం, సామాజిక మాధ్యమాల ప్రభావం వంటి అంశాలు విడాకుల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయని నిపుణులు అంటున్నారు. విడాకులు తీసుకోవడం అనేది ఒక వ్యక్తిగత నిర్ణయం. ప్రతి జంట వారి సంబంధాన్ని కొనసాగించలేకపోవడానికి కారణాలు వేర్వేరుగా ఉంటాయి. అయితే, మహిళలు విడాకులు తీసుకోవడానికి దారితీసే సాధారణ కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నమ్మకం లేకపోవడం:
ఇది విడాకులకు ప్రధాన కారణాలలో ఒకటి. భాగస్వామి మోసం చేసినప్పుడు వారి మధ్య నమ్మకం దెబ్బతింటుంది. ఇది సంబంధం విచ్ఛిన్నం అవ్వడానికి కారణమవుతుంది.
శారీరక వేధింపులు:
భాగస్వామి మానసికంగా లేదా శారీరకంగా హింసిస్తే అది విడాకులకు దారితీయవచ్చు. ఇటువంటి వేధింపులు సంబంధాన్ని విచ్ఛిన్నం చేస్తాయి.
ఆర్థిక సమస్యలు:
ఆర్థిక సమస్యలు కూడా విడాకులకు ఒక కారణం కావచ్చు. భాగస్వాముల మధ్య ఆర్థిక విభేదాలు లేదా ఒకరిపై ఒకరు ఆధారపడటం వల్ల అసంతృప్తి ఏర్పడవచ్చు. ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడం కూడా ఒక సమస్యగా మారుతుంది.
పిల్లల పెంపకం:
పిల్లల పెంపకం విషయంలో భాగస్వాముల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం, ఒకరికొకరు సహాయం చేసుకోకపోవడం వంటివి కూడా విడాకులకు దారితీయవచ్చు.
స్వేచ్ఛ లేకపోవడం:
సంబంధంలో ఒకరినొకరు నియంత్రించడం లేదా స్వేచ్ఛగా ఉండటానికి అనుమతించకపోవడం కూడా విడాకులకు దారితీయవచ్చు.
Also Read:
అహ్మదాబాద్ టూ పహల్గామ్ ఎటాక్ .. 6 నెలల్లో అనేక ప్రమాదాలు..
15 ఏళ్ల తర్వాత కలిశారు.. విమానం విషాదం మిగిల్చింది..
For More National News