Scam Alert: యాత్రికులు, టూరిస్టులకు కేంద్రం అలర్ట్.. ఆన్‌లైన్ బుకింగ్ విషయంలో హెచ్చరిక
ABN , Publish Date - Apr 19 , 2025 | 03:42 PM
సమ్మర్ టైంలో అనేక మంది కూడా తీర్థయాత్రలతోపాటు అనేక ప్రాంతాలకు వెళ్లాలని చూస్తుంటారు. ఇదే సమయాన్ని అవకాశంగా తీసుకున్న కేటుగాళ్లు ఫేక్ వెబ్ సైట్లు క్రియేట్ చేసి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. దీనిపై సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది.

సమ్మర్ సీజన్ వచ్చేసింది. ఈ క్రమంలో అనేక మంది టూర్లు వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటారు. కేదార్‌నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి వంటి అనేక పవిత్ర ప్రాంతాలకు లక్షలాది మంది యాత్రికులు వెళ్తుంటారు. అలాగే, చాలా మంది వేసవి సెలవుల్లో కుటుంబాలతో కలిసి విహార యాత్రలకు కూడా సిద్ధమవుతుంటారు. ఇదే సమయాన్ని పలువురు మోసగాళ్లు అవకాశంగా తీసుకుని ఆసరాగా మార్చుకుంటున్నారు. ఫేక్ వెబ్‌సైట్లు, బోగస్ టూర్ ప్యాకేజీలతో ఆన్‌లైన్ బుకింగ్ మోసాల పేరుతో స్కాం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది. తెలియని వారి నుంచి వచ్చే లింకులను క్లిక్ చేసి మోసపోవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మోసగాళ్లు ఎలాంటి స్కాంలు చేసే ఛాన్సుంది
మోడర్న్ డిజైన్‌తో అద్భుతంగా కనిపించే నకిలీ వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా పేజీలు, స్పాన్సర్డ్ టూరిస్ట్ ప్రకటనలు ఇవన్నిటీ లక్ష్యం ఒకటే. చీట్ చేసి డబ్బు దోచుకోవడమే టార్గెట్. ఉదాహరణకు కేదార్‌నాథ్ హెలికాప్టర్ బుకింగ్‌లు, గెస్ట్ హౌస్, హోటల్ రిజర్వేషన్లు, క్యాబ్/టాక్సీ బుకింగ్‌లు, హాలిడే ప్యాకేజీలు, మతపరమైన టూర్‌ల పేరుతో ఫేక్ వైబ్ సైట్లు క్రియేట్ చేసి ప్రజలను లూటీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అవి అచ్చం నిజమైనవే అన్నట్టుగా చూపిస్తూ దోచేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ప్రభుత్వ సూచనలు
ప్రతీ వెబ్‌సైట్ చట్టబద్ధతను ధృవీకరించండి. URL చూస్తే మీరు గమనించాలి: ‘https’ ఉందా? సైటు పేరు సరైనదేనా, కాదా అని పరిశీలించాలి
అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే వినియోగించండి:
కేదార్‌నాథ్ హెలికాప్టర్ బుకింగ్: https://www.heliyatra.irctc.co.in
సోమ్‌నాథ్ గెస్ట్ హౌస్ బుకింగ్: https://somnath.org
ప్రసిద్ధ ట్రావెల్ ఏజెన్సీలను మాత్రమే నమ్మండి
స్పాన్సర్డ్ లింక్‌లు, మెసేజ్‌లను క్లిక్ చేసే ముందు డబుల్ చెక్ చేయండి. అవి నమ్మకంగా అనిపించినా, ముందు వెబ్‌సైట్‌కి వెళ్లి మళ్లీ పరిశీలించండి.
మోసపోయినట్టు అనిపిస్తే వెంటనే కంప్లైంటే చేయండి
వెబ్‌సైట్: www.cybercrime.gov.in
టోల్ ఫ్రీ నెంబర్: 1930
చేయకూడనివి (Don’ts):
నకిలీ సైట్లను నమ్మవద్దు, కేవలం డిజైన్‌కి మోసపోవద్దు
ధృవీకరణ లేకుండా చెల్లింపులు చేయకండి. కన్ఫర్మేషన్ మెయిల్ లేదా SMS రాకపోతే వెంటనే అప్రమత్తం అవ్వండి
WhatsApp లేదా Facebook లింకుల ద్వారా బుకింగ్స్ చేయవద్దు. ప్రత్యేకంగా మీకు వచ్చిన మెసేజ్‌లు అసలైనవే అనే నమ్మకం వద్దు
తెలియని ఫోన్ నంబర్లు లేదా స్పందించని ఇమెయిల్స్‌ను విస్మరించకండి. అలాంటి వాటి గురించి తక్షణమే సైబర్ క్రైమ్‌కి రిపోర్ట్ చేయండి
కేంద్రం చేపడుతున్న చర్యలు
ఇప్పటివరకు ప్రభుత్వ సంస్థలు ఈ మోసాలపై విస్తృతంగా చర్యలు తీసుకుంటున్నాయి:
Google, WhatsApp, Facebook వంటి ప్లాట్‌ఫార్మ్స్‌తో డేటా షేరింగ్ చేసి, నకిలీ కంటెంట్‌ను తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు.
రోజు వారీగా నకిలీ వెబ్‌సైట్లను, ఫేక్ అకౌంట్స్‌ను ట్రాక్ చేస్తూ నిలిపివేస్తున్నారు.
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు పోర్టల్‌ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా రూపొందించారు.
ఇవి కూడా చదవండి:
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Monthly Income: 50 ఏళ్ల తర్వాత నెలకు రూ.లక్ష కావాలంటే ఎంత సేవ్ చేయాలి, ఎన్నేళ్లు చేయాలి
Read More Business News and Latest Telugu News