Green Apple Benefits: ప్రతి రోజూ గ్రీన్ ఆపిల్ తింటే.. ఇన్ని సమస్యలు దూరమవుతాయా?
ABN , Publish Date - Nov 02 , 2025 | 07:04 PM
ప్రతి రోజూ గ్రీన్ ఆపిల్ తినడం మంచిదేనా? ఈ ఆపిల్ తింటే ఎలాంటి సమస్యలు దూరమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: ఆపిల్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఫైబర్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. ప్రతి రోజూ గ్రీన్ ఆపిల్ తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా, చాలా సమస్యలు దూరమవుతాయని చెబుతున్నారు.
గ్రీన్ ఆపిల్స్ తినడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. గ్రీన్ ఆపిల్ ఆల్జీమర్స్ వ్యాధిని దూరం చేస్తుందని చెబుతున్నారు. జీర్ణ క్రియని మెరుగుపరుస్తుందని అంటున్నారు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
గ్రీన్ ఆపిల్స్ తింటే ఊపిరితిత్తుల ఆరోగ్యం కూడా బాగుంటుందని, అంతేకాకుండా, శ్వాస సమస్యల్ని దూరం చేస్తుందని అంటున్నారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, కనిజాలు ఇందులో పుష్కలంగా ఉంటాయని, జీర్ణక్రియ రేటు మెరుగుపడుతుందని చెబుతున్నారు.
అంతేకాకుండా, శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుందని, బరువు కూడా తగ్గిస్తుందని అంటున్నారు. బరువు ఎక్కువగా ఉన్నవాళ్లు గ్రీన్ ఆపిల్ తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా గ్రీన్ ఆపిల్ ప్రతి రోజూ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సాధారణ ఆపిల్ లాగే గ్రీన్ ఆపిల్‌లో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. కాబట్టి, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రతి రోజూ గ్రీన్ ఆపిల్ తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read:
లావు ఉన్న వారికి నిమ్మ తొక్కలు ఓ వరం.. ఎలా అంటే?
శీతాకాలంలో ఖర్జూరాలు ఎందుకు తినాలో తెలుసా?
For More Latest News