Jewelry Cleaning Tips: మీ బంగారం, వెండి ఆభరణాలు నల్లగా మారాయా? ఇంట్లోనే ఇలా శుభ్రం చేయండి
ABN , Publish Date - Nov 15 , 2025 | 02:40 PM
మీ బంగారం, వెండి ఆభరణాలు నల్లగా మారాయా? అయితే, వాటిని ఇంట్లోనే మెరిసేలా చేయడానికి కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: బంగారం, వెండి ఆభరణాలు కాలక్రమేణా నల్లగా మారతాయి. బంగారం మిశ్రమంలోని ఇతర లోహాలు చెమట, గాలిలోని ఆక్సిజన్‌తో చర్య జరపడం వల్ల అవి నల్లబడుతాయి. వెండి ఆభరణాలు కూడా గాలిలోని సల్ఫర్ సమ్మేళనాలతో చర్య జరిపి 'వెండి సల్ఫైడ్' ఏర్పరచడం వల్ల బ్లాక్ కలర్ లోకి వస్తాయి. అయితే, నల్లగా మారిన జువెలరీని ఇంట్లోనే కొన్ని సింపుల్ టిప్స్ ద్వారా క్లీన్ చేసుకోవచ్చు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
జువెలరీని ఇలా క్లీన్ చేసుకోండి
గోరువెచ్చని నీరు, డిష్ వాషింగ్ లిక్విడ్ ద్రావణాన్ని తీసుకోండి. ముందుగా, గోరువెచ్చని నీటిని ఒక గిన్నెలో పోసి, డిష్ వాషింగ్ లిక్విడ్‌తో కలపండి. తరువాత, మీ బంగారు ఆభరణాలను అందులో 25 నుండి 30 నిమిషాలు నానబెట్టండి. తరువాత, మృదువైన వస్త్రం లేదా బ్రష్ ఉపయోగించి నగలను శుభ్రం చేయండి.
వెనిగర్ వాడటం వల్ల కూడా ఆభరణాలు మెరుస్తాయి. నగలను శుభ్రం చేయడానికి, ఒక గిన్నెలో రెండు నుండి మూడు టీస్పూన్ల వెనిగర్, బేకింగ్ సోడా కలపండి. తరువాత, మీ బంగారు, వెండి ఆభరణాలను ఈ మిశ్రమంలో ఏడు నుండి పది నిమిషాలు నానబెట్టండి. తర్వాత నగలను తీసి శుభ్రమైన నీటిలో శుభ్రం చేసుకోండి. నల్ల మరకలు మాయమవుతాయి.
గోరువెచ్చని నీటిలో ఉప్పు, బేకింగ్ సోడా, అల్యూమినియం ఫాయిల్ వేసి మీ వెండి ఆభరణాలను దాదాపు 20 నిమిషాలు బాగా నానబెట్టండి. తరువాత, ఆభరణాలను శుభ్రమైన నీటితో శుభ్రం చేసి, మృదువైన గుడ్డతో తుడవండి.
నిమ్మకాయ వాడటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బంగారు, వెండి ఆభరణాలను నిమ్మకాయ సులభంగా శుభ్రం చేసి మెరిసేలా చేస్తుంది. ఒక గిన్నెలో నిమ్మరసం పోసి ఉప్పు వేసి పేస్ట్‌లా తయారు చేసుకోండి. ఈ పేస్ట్‌ను మీ ఆభరణాలకు అప్లై చేసి ఒక గుడ్డ లేదా బ్రష్‌తో స్క్రబ్ చేసి 15 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత, ఆభరణాలను శుభ్రమైన నీటితో శుభ్రం చేసి, మృదువైన వస్త్రంతో పొడిగా తుడవండి. ఇది మీ ఆభరణాల నుండి మరకను పూర్తిగా తొలగిస్తుంది.
Also Read:
ఈ సమస్యలతో బాధపడేవారు బాదం తినకపోవడం బెటర్
బరువు తగ్గడానికి ఖాళీ కడుపుతో ఈ పండు తింటే అద్భుతమైన ఫలితాలు.. !
For More Latest News