Share News

Zelensky Removes Top Aide: జెలెన్‌స్కీ ప్రధాన కార్యనిర్వాహక అధికారి తొలగింపు.. కారణమిదే.?

ABN , Publish Date - Nov 29 , 2025 | 10:51 AM

ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రధాన కార్యనిర్వాహక అధికారి యెర్మాక్ విధుల నుంచి తొలగిపోయారు. కొన్నేళ్లుగా ఆయనతో సన్నిహిత సంబంధాలున్న జెలెన్‌స్కీకి.. రష్యాతో యుద్ధ విరమణ నేపథ్యంలో ఇలా జరగడంతో తీవ్ర తలనొప్పిగా మారినట్టైంది.

Zelensky Removes Top Aide: జెలెన్‌స్కీ ప్రధాన కార్యనిర్వాహక అధికారి తొలగింపు.. కారణమిదే.?
Ukrainian President Zelensky Removes Top Aide

ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రధాన కార్యనిర్వాహక అధికారి ఆండ్రీ యెర్మాక్‌(Andriy Yermak) ఉద్వాసనకు గురయ్యారు(Ukrainian President Zelensky Removes Top Aide). ఆ దేశంలో చమురు రంగంలో సుమారు 10 కోట్ల డాలర్ల అవినీతి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతకముందు ఈ దర్యాప్తులో భాగంగా.. యెర్మాక్ నివాసం, కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు(National Anti-Corruption Agency).


15 ఏళ్లుగా..

54 ఏళ్ల యెర్మాక్.. జెలెన్‌స్కీ(Zelensky)కి ముఖ్య అనుచరుడు. ఒకప్పుడు టీవీ హాస్యనటుడిగా పేరున్న జెలెన్‌స్కీకి.. మాజీ నిర్మాత, కాపీరైట్ న్యాయవాది అయిన యెర్మాక్‌తో సుమారు 15 ఏళ్ల నుంచి సన్నిహిత సంబంధాలున్నట్టు తెలుస్తోంది. 2019లో వీరివురూ ఆ దేశ రాజకీయాల్లో ప్రవేశించి కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్ దేశాధ్యక్షుడైన తర్వాత జెలెన్‌స్కీతో యెర్మాక్(Yermak) సంబంధం మరింత బలపడింది. ఆ దేశ ప్రధాని సహా ఇతర మంత్రులను నియమించడంలోనూ ఆయన కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం. ఇలా యెర్మాక్.. ఆ దేశంలో రెండో ప్రభావవంతమైన వ్యక్తిగానే కాకుండా.. ఒకానొక సందర్భంలో వైస్ ప్రెసిడెంట్ అని కూడా పలువురి నుంచి కితాబందుకున్నారు. రష్యా(Russia)తో యుద్ధం నేపథ్యంలో.. అమెరికా(America)తో సంబంధాలను మెరుగుపరిచేందుకు జరిగే చర్చల్లో ఉక్రెయిన్ తరఫున కీలకపాత్ర పోషించారాయన. ప్రస్తుతం.. రష్యాతో యుద్ధాన్ని విరమించుకోవాలని అమెరికా నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్న సందర్భంలో.. యెర్మాక్ ఇలా ఉద్వాసనకు గురికావడం జెలెన్‌స్కీకి తీవ్ర తలనొప్పిగా మారినట్టైంది.


ఐరోపా సమాఖ్య(ఈయూ)లో చేరాలనుకుంటున్న జెలెన్‌స్కీకి.. తొలుత అవినీతిని నిర్మూలించాలనే నిబంధన విధిస్తోంది ఈయూ. దీంతో జెలెన్‌స్కీతో సంబంధమున్న యెర్మాక్‌పై వేటు పడింది. ఈ చమురు కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే ఆ దేశంలో ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు. యెర్మాక్ ఇద్దరు అసిస్టెంట్లలో ఒకరు గతేడాది రాజీనామా చేయగా, మరొకరు ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్నారు. ఈ ముగ్గురిపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ తరుణంలో యెర్మాక్‌ను తొలగించాలని ప్రతిపక్షాల నుంచి పెరుగుతున్న ఒత్తిడి కారణంగా ఆయన రాజీనామా చేశారు(Andriy Yermak has submitted his resignation). జెలెన్‌స్కీ దీనిని ఆమోదించడంతో.. ఆయన విధుల నుంచి తొలగిపోయారు.


ఇవీ చదవండి:

ఆయనకు ఏమైనా జరిగితే పాక్‌లో కల్లోలం: ఇమ్రాన్ ఖాన్ సోదరి

పేద దేశాల పౌరులకు నో ఎంట్రీ

Updated Date - Nov 29 , 2025 | 11:39 AM