Earthquake: రష్యా భూకంపం చాలా బలమైంది.. అయినా మాస్కో నగరాన్ని ఎందుకు ప్రభావితం చేయలేదు?
ABN , Publish Date - Jul 30 , 2025 | 08:57 PM
రష్యా భూకంపం అత్యంత బలమైన భూకంపాలలో ఒకటి. ఇది తీరప్రాంతంలో అలలను ఉవ్వెత్తున లేచేలా చేసింది. 8.8 తీవ్రతతో సంభవించిన ఈ తీవ్ర భూకంపం రష్యా రాజధాని మాస్కో మీద మాత్రం ఎటువంటి ప్రభావం చూపలేదు. ఎందుకు?

ఇంటర్నెట్ డెస్క్: బుధవారం తెల్లవారుజామున రష్యాను తాకిన భూకంపం ఇప్పటివరకు నమోదైన అత్యంత బలమైన భూకంపాలలో ఒకటి. రష్యా నగరమైన పెట్రోపావ్లోవ్స్క్-కామ్‌చాట్స్కీ నుండి 119 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. అంతేకాదు, ఈ భూకంపం పసిఫిక్ మహాసముద్ర తీరప్రాంతంలో అనేక అడుగుల మేర అలలను ఉవ్వెత్తున లేచేలా చేసింది. 8.8 తీవ్రతతో సంభవించిన ఈ తీవ్ర భూకంపం.. విచిత్రంగా రష్యా రాజధాని మాస్కో మీద మాత్రం ఎటువంటి ప్రభావం చూపలేదు.
ఎందుకు?
ఇప్పటి భూకంప కేంద్రమైన కమ్‌చట్కా ద్వీపకల్పం నుండి దాదాపు 6,800 కిలోమీటర్ల దూరంలో ఉంది రష్యా రాజధాని అయిన మాస్కో నగరం. అంతేకాదు, మాస్కో క్రియాశీల టెక్టోనిక్ ప్లేట్ లిమిట్స్‌కు దూరంగా ఉంది. ఇది స్థిరమైన తూర్పు యూరోపియన్ ప్లాట్‌ఫారమ్‌పై ఉంది. భౌగోళికంగా ప్రశాంతమైన భూభాగంలో ఉండటం కారణంగా ఇది టెక్టోనిక్ ఒత్తిళ్లను అనుభవించదు.
నిజానికి, మాస్కో ప్రాంతాన్ని ప్రపంచంలోనే అత్యంత భూకంప రహిత ప్రాంతాలుగా పరిగణిస్తున్నారు. అక్కడ ఇప్పటివరకు పెద్ద భూకంపాలేవీ నమోదు కాలేదు. ఇంకా చెప్పాలంటే, అక్కడ భూప్రకంపనలే లేవు. అందుకే.. ఇప్పుడు కమ్ చట్కా ద్వీపకల్పాన్ని తాకిన భూకంపం వంటి భూ ప్రకంపనలు సాధారణంగా మాస్కోను ప్రభావితం చేయలేవు. ఆ ప్రకంపనలు మాస్కో ప్రాంతానికి చేరుకునే సమయానికే అవి శక్తిని కోల్పోతాయి. అంతటి సేఫ్ జోన్ లో ఉంది మాస్కో నగరం.
ఇవి కూడా చదవండి..
నన్ను కంట్రోల్ చేయకండి.. కస్సుమన్న జయాబచ్చన్
అప్పటివరకూ పాక్‌కు సింధూ జలాలు ఇవ్వం.. తేల్చిచెప్పిన జైశంకర్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి