Share News

Megha Vemuri: మేఘా వేమూరిపై కాలేజ్ ఎందుకు బ్యాన్ విధించిందంటే..

ABN , Publish Date - May 31 , 2025 | 02:58 PM

Who Is Megha Vemuri: మేఘా పాలస్తీనాకు మద్దతుగా.. ఎమ్ఐటీపై చేసిన వ్యాఖ్యలతో యూనివర్శిటీ ఛాన్సలర్ మెలిసా నోబెల్స్ మండిపడ్డారు. మేఘాను, ఆమె కుటుంబాన్ని వెంటనే కార్యక్రమం నుంచి ఇంటికి పంపేశారు.

Megha Vemuri: మేఘా వేమూరిపై కాలేజ్ ఎందుకు బ్యాన్ విధించిందంటే..
Who Is Megha Vemuri

మేఘా వేమూరి.. ఇప్పుడు స్థానిక మీడియా దగ్గరినుంచి అంతర్జాతీయ మీడియా వరకు ఈ అమ్మాయి గురించే వార్తలు రాస్తున్నాయి. ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రాడ్యూయేషన్ కార్యక్రమంలో మేఘా పాలస్తీనాకు మద్దతుగా మాట్లాడింది. తాను చదివిన కాలేజీపైనే కామెంట్లు చేసింది. దీంతో ఆమెను, ఆమె కుటుంబాన్ని కార్యక్రమం నుంచి ఇంటికి పంపేశారు. మేఘా స్పీచ్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ట్రెండింగ్‌లో నిలిచిన మేఘ ఎవరు.. ఎమ్ఐటీ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఆమె ఏం మాట్లాడింది.. ఇంతకీ ఆమె చేసిన తప్పేంటి..


మేఘా ఎవరు..

మేఘా వేమూరి ఇండో అమెరికన్ అమ్మాయి. ఆమె జార్జియా, అల్ఫారెట్టాలో జన్మించింది. జార్జియాలోని అల్ఫారెట్టా హైస్కూల్లో చదువుకుంది. ఆ తర్వాత ఎమ్ఐటీలో చేరి కంప్యూటర్ సైన్స్, న్యూరో సైన్స్, లింగ్విస్టిక్స్‌లో తాజాగా డిగ్రీ పూర్తి చేసింది. ఆమె ఎమ్ఐటీ క్లాసు ప్రెసిడెంట్ కూడా.


ఎమ్ఐటీ కార్యక్రమంలో ఆమె ఏం మాట్లాడింది..

ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ దాడిలో పాలస్తీనా ఒకరకంగా నాశనం అయిపోయింది. అక్కడి ప్రజలు బాంబు దాడులతో, ఆకలి కొరతతో చనిపోతూ ఉన్నారు. ఎమ్ఐటీ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో మేఘా మాట్లాడుతూ.. ‘ ఇజ్రాయెల్‌తో ఎమ్ఐటీ సంబంధాలు కలిగి ఉంది. అంటే దానర్థం.. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు మన దేశంతో పాటు మన స్కూలు కూడా మద్దతు తెలుపుతున్నట్లే.. సాయం చేస్తున్నట్లే..


పాలస్తీనాను ఈ భూమ్మీదనుంచి లేకుండా చేయడానికి ఇజ్రాయెల్ చూస్తోంది. దాన్ని మనం చూస్తూ ఉరికే ఉన్నాం. ఆ దారుణంలో ఎమ్ఐటీ భాగం అవ్వటం సిగ్గుచేటు. ఇజ్రాయెల్ మిలటరీతో సంబంధాలు తెంచుకోవాలని డిమాండ్ చేస్తూ.. గత సంవత్సరం ఎమ్ఐటీ గ్రాడ్యుయేట్స్ బాడీ, అండర్ గ్రాడ్యుయేట్ యూనియన్ ఓట్లు వేసింది. గాజాలో శాశ్వత కాల్పుల విరమణ కోసం మీరు (కాలేజీ సిబ్బంది) పిలుపునిచ్చారు. పాలస్తీనా కోసం పోరాడుతున్న వారికి మద్దతుగా నిలిచారు’ అని అంది. మేఘా పాలస్తీనాకు మద్దతుగా.. ఎమ్ఐటీపై చేసిన వ్యాఖ్యలతో యూనివర్శిటీ ఛాన్సలర్ మెలిసా నోబెల్స్ మండిపడ్డారు. మేఘాను, ఆమె కుటుంబాన్ని వెంటనే కార్యక్రమం నుంచి ఇంటికి పంపేశారు.


ఇవి కూడా చదవండి

అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్‌ పార్క్‌కు మార్గం సుగమం

వీల్‌‌చైర్‌ నుంచి సిక్సులు. . డివిలియర్స్ అంటే ఇది!

Updated Date - May 31 , 2025 | 03:12 PM