Share News

India Pak War: యుద్ధం పరిష్కారం కానేకాదు.. భారత్‌కు ఐరాసా సూచన

ABN , Publish Date - May 05 , 2025 | 10:08 PM

సైనిక పరిష్కారం పరిష్కారం కాదు అని పహల్గాం దాడిపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

India Pak War: యుద్ధం పరిష్కారం కానేకాదు.. భారత్‌కు ఐరాసా సూచన
India Pak War

UNO on India Pak War: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి, భారతదేశం-పాకిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీసే దశలోకి తీసుకువచ్చిన నేపథ్యంలో, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ “సైనిక పరిష్కారం పరిష్కారం కాదు” అని పేర్కొన్నారు. "ఎటువంటి పొరపాటు చేయవద్దు, సైనిక పరిష్కారం పరిష్కారం కాదు, శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి రెండు ప్రభుత్వాలకు నా ఆఫీస్ ను అందిస్తున్నాను" అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అన్నారు. పాకిస్థాన్ అత్యవసర సమావేశ అభ్యర్థన మేరకు ఇండియా, పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను పరిష్కరించడానికి UN భద్రతా మండలి ఇవాళ క్లోజ్డ్ డోర్ సమావేశాన్ని నిర్వహించింది. న్యూయార్క్‌లోని UN ప్రధాన కార్యాలయంలో ఈ చర్చలు జరిగాయి. పహల్గాం దాడిని UN చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ ఖండించారు. దాడి చాలా బాధాకరమే అయినప్పటికీ యుద్ధం పరిష్కరం కాదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Pahalgam Terror Attack: పాక్‌కు వ్యతిరేకంగా భారత్ మరో కీలక నిర్ణయం

TGSRTC Workers Strike: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..

WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

TGSRTC: బస్ భవన్‌‌ను ముట్టడించిన కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 05 , 2025 | 10:09 PM