Share News

US warns Indian students: అమెరికా విద్యార్థులకు షాక్.. క్లాస్‌లు ఎగ్గొడితే వీసా రద్దు

ABN , Publish Date - May 27 , 2025 | 06:35 PM

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ఏదో ఒక కారణం చెప్పి విదేశీ విద్యార్థుల వీసాలను అక్కడి అధికారులు రద్దు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో కొత్త నిబంధనను అమలులోకి తీసుకొచ్చారు. ఆ నిబంధన విద్యార్థులందరికీ షాకివ్వడం మాత్రం ఖాయం.

US warns Indian students: అమెరికా విద్యార్థులకు షాక్.. క్లాస్‌లు ఎగ్గొడితే వీసా రద్దు
US warns Indian students visa cancellation

అమెరికా (America)లో చదువుకోవాలని ఇతర దేశాలకు చెందిన చాలా మంది విద్యార్థులు (Students) కలలు కంటూ ఉంటారు. ఎంతో కష్టపడి వీసాలు సంపాదించి లక్షల్లో ఫీజులు కట్టి అమెరికాలో వాలిపోతారు. అయితే డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధ్యక్షుడు అయిన తర్వాత ఏదో ఒక కారణం చెప్పి విదేశీ విద్యార్థుల వీసాలను (US Visa) అక్కడి అధికారులు రద్దు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో కొత్త నిబంధనను అమలులోకి తీసుకొచ్చారు. ఆ నిబంధన విద్యార్థులందరికీ షాకివ్వడం మాత్రం ఖాయం.


అమెరికా విద్యా సంస్థల్లో చదివే భారతీయులు (Indian Students), విదేశీ విద్యార్థులు ఎవరైనా ఇక క్లాస్‌లను బంక్ కొట్టడానికి లేదు. తరచుగా క్లాస్‌లకు గైర్హాజరు అయితే వీసాను రద్దు చేయబోతున్నట్టు అక్కడి అధికారులు ప్రకటించారు. ఈ మేరకు భారత్‌లోని అమెరికా ఎంబసీ తాజాగా ఓ ప్రకటన జారీ చేసింది. అమెరికాలోని విద్యాసంస్థ నుంచి డ్రాపౌట్ అయినా, క్లాస్‌లు ఎగ్గొట్టినా విదేశీ విద్యార్థుల వీసా రద్దవుతుందని, భవిష్యత్తులో కూడా అమెరికా నుంచి ఎలాంటి వీసా లభించదని అమెరికా ఎంబసీ ప్రకటించింది.


అమెరికా వీసా విషయంలో సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని అమెరికా ఎంబసీ సూచించింది. కాగా, ప్రస్తుత సంవత్సర గణాంకాలను బట్టి చూస్తే విదేశాల్లో చదువుకుంటున్న భారతీయుల సంఖ్య 13 లక్షలు. వారిలో అధికశాతం మంది అమెరికానే వెళ్తున్నారు. గతేడాది లెక్కల ప్రకారం 3.3 లక్షల మంది భారతీయులు అమెరికా విద్యాసంస్థల్లో చదువుతున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో కెనడా, యూకే ఉన్నాయి.


ఇవి కూడా చదవండి:

భారతీయుల ఈమెయిల్స్‌కు రిప్లై ఇవ్వను.. న్యూజిలాండ్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్య

క్లాసులు ఎగ్గొడితే వీసా రద్దు.. భారతీయ విద్యార్థులకు అమెరికా మరో వార్నింగ్

Read Latest and NRI News

Updated Date - May 27 , 2025 | 06:44 PM