US-India: భారత్‌ను బలహీనపరిచేందుకు అమెరికా తప్పక ప్రయత్నిస్తుంది.. యూఎస్ ఆర్థికవేత్త హెచ్చరిక
ABN , Publish Date - Jun 12 , 2025 | 05:13 PM
తనకు సవాళ్లు ఎదురవుతాయని భావిస్తే అమెరికా కచ్చితంగా భారత్‌ను బలహీనపరిచే ప్రయత్నం చేస్తుందని ప్రముఖ ఆర్థికవేత్త శాక్స్ తాజాగా హెచ్చరించారు.

ఇంటర్నెట్ డెస్క్: అన్ని రంగాల్లో పురోగమిస్తున్న భారత్‌ను అమెరికా బలహీనపరిచే ప్రయత్నం చేస్తుందని అమెరికా ఆర్థికవేత్త జెఫ్రీ శాక్స్ హెచ్చరించారు. చైనా, రష్యాలతో అమెరికా ఇలాగే వ్యవహరించిందని గుర్తు చేశారు. ఏ దేశమైన తనకు సవాలు విసిరే స్థాయికి చేరుకుంటోందంటే అగ్రరాజ్యం ఇలాగే వ్యవహరిస్తుందని అన్నారు. ఓ టీవీ షోలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా, చైనాలతో అమెరికా ఇలాగే వ్యవహరిస్తున్న విషయాన్ని కూడా తన వాదనకు ఆధారంగా చూపించారు.
‘రష్యా భారీ దేశం, శక్తిమంతమైన దేశం. ఈ ఒక్క కారణంతోనే అమెరికా రష్యాను వ్యతిరేకిస్తోంది. చైనాను కూడా ఇదే కారణంతో వ్యతిరేకిస్తోంది’ అని శాక్స్ అన్నారు. శాక్స్ గతంలో కూడా అనేక మార్లు అమెరికా విదేశాంగ విధానంపై విమర్శలు ఎక్కుపెట్టారు.
‘గతంలో రష్యాను బలహీన పరిచేందుకు అమెరికా ప్రయత్నించింది. ఇప్పుడు రష్యాతో కూడా ఇలాగే వ్యవహరిస్తోంది. ఓ శక్తిమంతమైన దేశంపై అమెరికా రియాక్షన్ ఎప్పుడూ ఇలాగే ఉంటుంది’ అని శాక్స్ హెచ్చరించారు. భారత్‌ను బలహీన పరిచేందుకు అమెరికా ప్రయత్నిస్తుందని అన్నారు. ఈ ప్రయత్నం త్వరలోనే జరిగినా ఆశ్చర్యపోవక్కర్లేదని టీవీ యాంకర్ శాక్స్ వ్యాఖ్యలకు బదులిచ్చారు.
రాబోయే 15 ఏళ్లల్లో భారత్ అమెరికాను అధిగమించి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని శాక్స్ గతంలోనే ప్రకటించారు. భారత్ సాధిస్తున్న ప్రగతిపై కూడా ఆయన ఇటీవల ప్రశంసలు కురిపించారు. అయితే, అమెరికా ఆటలో పావుగా మారొద్దని శాక్స్ భారత్‌ను హెచ్చరించారు. చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా భారత్‌ను వాడుకుందామని ప్రయత్నిస్తోంది. కానీ ఈ ఆటలో అమెరికాకు పావుగా మారొద్దు. ఇలా లొంగిపోయేంత చిన్న దేశం భారత్ కాదు’ అని అన్నారు.
ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాతో బంధాలను తగ్గించుకోవాలని అమెరికా భారత్‌పై ఒత్తిడి చేస్తున్న విషయం తెలిసిందే. కానీ భారత్ మాత్రం రష్యాతో తన చారిత్రక బంధాన్ని యథాతథంగా కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా కామర్స్ సెక్రెటరీ హావర్డ్ లుట్నీక్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా ఆయుధాల కొనుగోలు, బ్రిక్స్‌లో భాగమవడం వంటి పనులు అమెరికాకు చిరాకు కలిగిస్తున్నాయని అన్నారు.
ఇవీ చదవండి:
శ్వేతసౌధంలో ట్రెజరీ సెక్రెటరీతో మస్క్ బాహాబాహీ.. విషయం తెలిసి ట్రంప్ షాక్
మస్క్ తప్పు చేస్తున్నారు.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి