Share News

US Reduction in Tariffs: భారత్‌పై సుంకాలను తగ్గిస్తున్నట్టు అమెరికా ప్రకటన.!

ABN , Publish Date - Nov 11 , 2025 | 02:21 PM

భారత్‌పై ఇటీవల సుంకాలను అమాంతం పెంచేసిన అమెరికా ఇప్పుడు వాటిని తగ్గిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.

US Reduction in Tariffs: భారత్‌పై సుంకాలను తగ్గిస్తున్నట్టు అమెరికా ప్రకటన.!
Donald Trump

ఇంటర్నెట్ డెస్క్: సుంకాల పేరిట భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతున్న అమెరికా తాజాగా శుభవార్త అందించింది. భారత్‌పై సుంకాలను(US Tariff on India) సగానికి అనగా 50 శాతం తగ్గిస్తున్ననట్టు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రష్యా చమురు కొనుగోళ్లే ఈ సుంకాలు రెట్టింపు కావడానికి ప్రధాన కారణమని ట్రంప్ స్పష్టం చేశారు.


'రష్యా చమురు కొనుగోళ్ల కారణంగా భారత్‌పై అధిక సుంకాలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు భారత్ ఆ కొనుగోళ్లను తగ్గించింది. ఫలితంగా.. మేము ఆ సుంకాలను సగానికి తగ్గిస్తున్నాం.' అని ట్రంప్ అన్నారు. అంతకముందు భారత్‌తో వాణిజ్య సంబంధాలలో తగ్గుదల గురించి ట్రంప్ సూచనప్రాయంగా మాట్లాడుతూ.. తాము ఇండియాతో వాణిజ్య ఒప్పందానికి అతి దగ్గరగా ఉన్నామని, భారతీయ వస్తువులపై విధించిన అధిక సుంకాలను త్వరలో తగ్గించే అవకాశమున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ట్రంప్.. ప్రధాని మోదీని కూడా ప్రశంసించారు.


భారత్.. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తుందన్న కారణంతో.. తొలుత 25 శాతం సుంకాన్ని విధించారు ట్రంప్. ఆ తర్వాత దాన్ని 50 శాతానికి పెంచారు. రష్యా నుంచి చమురు, ఆయుధాలను కొనుగోలు చేయడం ద్వారా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత్.. రష్యాకు ఆర్థికంగా మద్దతిస్తోందని ట్రంప్ ఆరోపించిన విషయం తెలిసిందే.


ఇవీ చదవండి:

పాక్ ఆర్మీ చీఫ్‌‌‌కు లబ్ధి చేకూర్చే రాజ్యాంగ సవరణ.. భగ్గుమన్న ప్రతిపక్షాలు

ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్

Updated Date - Nov 11 , 2025 | 02:38 PM