Share News

US Lawyer Jailed: లేడీ లాయర్ మోస బుద్ధి.. ఏకంగా 74 కోట్లు కాజేసింది..

ABN , Publish Date - May 11 , 2025 | 07:25 AM

US Lawyer: దాదాపు 74 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అయితే, వాటిని లోన్లుగా ఎవ్వరికీ ఇవ్వలేదు. కింగ్ వాటిని తన అవసరాల కోసమే వాడుకుంది. అది కూడా జూదం కోసం వాటిని ఖర్చు చేసింది.

US Lawyer Jailed: లేడీ లాయర్ మోస బుద్ధి.. ఏకంగా 74 కోట్లు కాజేసింది..
US Lawyer

ఒకసారి జూదానికి బానిస అయితే.. దాన్నుంచి బయటపడ్డం అంత సులభం కాదు. నూటికి 90 శాతం మంది జీవితం నాశనం అయిపోయిన తర్వాత రియలైజ్ అవుతూ ఉంటారు. బయటపడ్డానికి ప్రయత్నిస్తారు. మిగిలిన 10 శాతం దాన్నుంచి బయటకు రాలేక ప్రాణాలు తీసుకుంటూ ఉంటారు. లేకపోతే.. ఇతరుల్ని మోసం చేసైనా జూదాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో ఓ లేడీ లాయర్ జూదానికి బానిస అయింది. ఎంతలా అంటే.. ఏకంగా 74 కోట్లు మోసం చేసి మరీ వాటిని జూదానికి వాడుకునేంతలా..


సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన సారా జాక్వైలిన్ కింగ్ అనే 41 ఏళ్ల మహిళకు లాయర్‌గా ఆ ప్రాంతంలో మంచి పేరుంది. లాయర్‌గా ఎంతో పేరు తెచ్చుకున్న ఆమె జూదానికి బానిస అయింది. తరచుగా స్లాట్స్ ఆడుతూ ఉండేది. ఈ నేపథ్యంలోనే ఆమె కొన్నేళ్ళ క్రితం కింగ్ ఫ్యామిలీ లెండింగ్ ఎల్‌ఎల్‌సీ పేరిట ఓ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఎక్కువ వడ్డీకి సినిమా సెలెబ్రిటీలకు, ప్రొఫెషనల్ అథ్లెట్స్, సంపన్నులకు అప్పులు ఇచ్చే బిజినెస్ అని పెట్టుబడి పెట్టే వారిని ఆకర్షించింది.


డబ్బులు తీసుకున్న వారు తిరిగి ఇవ్వకపోతే తానే ఆ డబ్బుల్ని ఇస్తానని నమ్మించింది. ఎక్కువ వడ్డీ వస్తుందన్న ఆలోచనతో చాలా మంది పెట్టుబడులు పెట్టారు. దాదాపు 74 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అయితే, కింగ్ వాటిని లోన్లుగా ఎవ్వరికీ ఇవ్వలేదు. తన అవసరాల కోసమే వాడుకుంది. అది కూడా జూదం కోసం వాటిని ఖర్చు చేసింది. విచ్చల విడిగా క్యాసినో స్లాట్లలో ఖర్చు పెట్టేసింది. కింగ్ మోసం గుర్తించిన పెట్టుబడిదారులు ఆమెపై కేసు పెట్టారు. తాజాగా, ఆమె చేసిన మోసం రుజువవ్వటంతో కోర్టు 21 నెలల జైలు శిక్ష విధించింది.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: ఇంకా బుద్ధిరాలేదు.. మళ్లీ అవే తప్పుడు కూతలు..

Nayanthara: మా అమ్మే నా సూపర్‌స్టార్‌..

Updated Date - May 11 , 2025 | 07:37 AM