US Green Card Arrests: ఇంటర్వ్యూలకు పిలిపించి అరెస్టులు
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:13 PM
మీకు ఫలానా తేదీన ఇంటర్వూ ఉంది రండి.. అంటూ పిలుస్తున్నారు. తీరా వచ్చిన తర్వాత ఏమాత్రం తేడాగా కనిపించినా అరెస్ట్ చేస్తున్నారు. ఈ వింత వ్యవహారం ఇప్పుడు అమెరికాలో హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా అమెరికాలో గ్రీన్ కార్డు హోల్డర్లు..
ఇంటర్నెట్‌డెస్క్: అమెరికాలో అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ కొత్త విధానం అమల్లోకి తెచ్చారు. ఇటీవల వైట్‌హౌస్ దగ్గర్లో జరిగిన కాల్పుల ఉదంతంతో ఖంగుతిన్న ట్రంప్.. దేశంలోని గ్రీన్ కార్డ్ హోల్డర్లపై నిఘా పెంచేలా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా అమెరికాలో శాశ్వత నివాసానికి జారీ చేసే గ్రీన్ కార్డు ఉన్న వారిని ఇంటర్వ్యూలకు అని పిలిపించి.. తేడాగా కనిపిస్తే, భద్రతాధికారులు అరెస్ట్‌లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే దీనికి సంబంధించి అధ్యక్షుడు ట్రంప్ సంబంధిత అధికారులకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. తాజాగా శాన్‌డియాగోలోని యూఎస్ సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ కార్యాలయంలో గ్రీన్ కార్డు ఇంటర్వ్యూ కోసం వచ్చిన ఓ వ్యక్తితో పాటు అతని అమెరికన్ భాగస్వామిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
వీసా గడువు ముగిసినా కూడా ఇంకా దేశంలోనే ఉన్నవారినే లక్ష్యంగా చేసుకొని ఈ అరెస్టులు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇలాగే ఇంటర్వ్యూల కోసం వచ్చిన తన అయిదుగురు క్లయింట్‌లను అదుపులోకి తీసుకున్నట్లు అమెరికాలోని ఒక లాయర్ వెల్లడించారు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా వారు ఇంకా దేశంలోనే ఉన్నారనే కారణంతో ఈ అరెస్టులు చేశారన్నారు. అయితే, వీరికి ఎలాంటి నేరచరిత్ర లేదని, వారంతా యూఎస్ పౌరులను వివాహం చేసుకున్నవారేనని చెప్పుకొచ్చారు.
అయితే, జాతీయ, ప్రజా, సరిహద్దు భద్రతకు కట్టుబడే తగు చర్యలు తీసుకుంటున్నామని ఇమ్మిగ్రేషన్ అధికారులు అంటున్నారు. అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉన్న వ్యక్తులను ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం అరెస్టు చేయడం, నిర్బంధించడం వంటివి జరుగుతాయని తేల్చి చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజకీయ నినాదాలు కాదు.. వివక్షకు ఆధారాలు చూపాల్సిందే
ముఖ్యమంత్రా.. రియల్ ఎస్టేట్ ఏజెంటా..?
Read Latest Telangana News and National News