TTP Blast: ఆత్మాహుతి దాడి.. 16 మంది పాక్ ఆర్మీ జవాన్లు మృతి
ABN , Publish Date - Jun 28 , 2025 | 05:41 PM
TTP Blast: ఈ ఏడాది మార్చి నెలలో తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ జందోలా మిలటరీ బేస్‌పై దాడి చేసింది. ఈ దాడిలో పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ ఆర్మీ జవాన్లు చనిపోయారు. భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది.

పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ (TTP) శనివారం ఆర్మీ కాన్వాయ్‌పై ఈ దాడి చేయగా.. 16 మంది జవాన్లు చనిపోయారు. 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా రాష్ట్రంలోని ఖడ్డీ ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షి చెబుతున్న దాని ప్రకారం.. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ వ్యక్తి సరుకుల వాహనంలో వేగంగా వచ్చి.. ఆర్మీ కాన్వాయ్‌ని ఢీకొట్టాడు. దీంతో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఆ ప్రాంతంలో ఉన్న రెండు ఇళ్ల పైకప్పులు కూలిపోయాయి.
దీంతో ఆరుగురు చిన్నారులు గాయపడ్డారు. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఈ మధ్య కాలంలో మిలిటెంట్లు వరుస దాడులకు పాల్పడుతున్నారు. పాకిస్తాన్ మిలటరీని టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నారు. మిలిటెంట్ల దాడుల్లో ఈ ఏడాది 290 మంది ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత సరిహద్దు ప్రాంతాల్లో మిలిటెంట్ల దాడులు ఎక్కవయ్యాయి. తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ తరచుగా పాకిస్తాన్ ఆర్మీపై దాడులు చేస్తోంది.
ఈ ఏడాది మార్చి నెలలో తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ జందోలా మిలటరీ బేస్‌పై దాడి చేసింది. ఈ దాడిలో పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ ఆర్మీ జవాన్లు చనిపోయారు. భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది. అయితే, అదే నెలలో పాకిస్తాన్ ఆర్మీ టీటీపీ రహస్య స్థావరాలపై డ్రోన్ దాడులు చేసింది. ఈ దాడుల్లో 11 మంది టీటీపీ సభ్యులు చనిపోగా.. 9 మంది గాయపడ్డారని పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది.
ఇవి కూడా చదవండి
మైగ్రేన్‌తో బాధపడుతున్నారా? కోక్‌తో చెక్ పెట్టండి..
పాత ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల నుంచి బంగారం ఎలా తీస్తారంటే..