Share News

Donald Trump: రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేసిందంటూ వార్తలు.. ట్రంప్ రెస్పాన్స్ ఇదీ

ABN , Publish Date - Aug 02 , 2025 | 08:23 AM

భారత ఆయిల్ రిఫైనరీలు రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేశాయంటూ వస్తున్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు. అది నిజమైతే మంచి నిర్ణయమని కామెంట్ చేశారు.

Donald Trump: రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేసిందంటూ వార్తలు.. ట్రంప్ రెస్పాన్స్ ఇదీ
Donald Trump on Russian Oil Import Halt

ఇంటర్నెట్ డెస్క్: రష్యా చమురు కొనుగోళ్లను భారత్‌ నిలిపివేసిందంటూ వస్తున్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అది నిజమైతే మంచి నిర్ణయమని కామెంట్ చేశారు. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

‘రష్యా నుంచి ఇండియా చమురు కొనుగోళ్లు నిలిపి వేసిందని నేను విన్నాను. అది నిజమో కాదో మాత్రం నాకు తెలియదు. చూద్దాం ఏం జరుగుతోందో... చమురు కొనుగోళ్ల నిలిపివేత మంచి నిర్ణయమే’ అని ట్రంప్ అన్నారు.

ఈ వార్తలపై భారత విదేశాంగ శాఖ కూడా స్పందించింది. భారత ఇంధన దిగుమతులు.. మార్కెట్ పరిస్థితులు, జాతీయ ప్రయోజనాలపై ఆధారపడి ఉంటాయని పేర్కొంది. భారతీయ ఆయిల్ కంపెనీలు రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేసినట్టు తమ దృష్టికి రాలేదని వెల్లడించింది.


భారతీయ ఆయిల్ రిఫైనరీలు ఈ వారం రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేసినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. డిస్కౌంట్స్ తగ్గడం, అమెరికా హెచ్చరికల నేపథ్యంలో ఈ వార్తలకు ప్రాధాన్యం ఏర్పడింది. అలాంటిదేమీ లేదని భారత విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఇక రష్యా నుంచి సముద్రమార్గంలో అత్యధికంగా చమురు దిగుమతి చేసుకునే దేశంగా భారత్ నిలిచింది.

ఈ అంశంపై అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో కూడా భారత్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పాశ్చాత్య దేశాల ఆంక్షలు ఉన్నప్పటికీ రష్యా చమురును దిగుమతి చేసుకోవడంపై విమర్శలు గుప్పించారు. ఆ తరువాత ట్రంప్ ప్రభుత్వం భారత్ నుంచి దిగుమతులపై 25 శాతం సుంకం విధించింది. రష్యా చమురు కొనుగోళ్లపై అదనపు పెనాల్టీలు కూడా విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ పెనాల్టీ ఎంత అనేది మాత్రం చెప్పలేదు.

ఈ నేపథ్యంలోనే భారతీయ ఆయిల్ రిఫైనరీలు చమురు కొనుగోళ్లను నిలిపివేసినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.


ఇవి కూడా చదవండి:

సుంకాలను పెంచుతూ ఆదేశాలు జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

భారత్‌పై 25 శాతం సుంకం విధింపు.. ట్రంప్ మరో కీలక ప్రకటన

మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 02 , 2025 | 08:37 AM