Share News

Trump Claims: ఆపరేషన్ సిందూర్‌పై మరో సారి కామెంట్లు చేసిన ట్రంప్

ABN , Publish Date - Jul 28 , 2025 | 09:38 PM

Trump Claims: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం తానే ఆపానని ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాడు. సోమవారం స్కాట్‌లాండ్‌లో పర్యటించిన ఆయన అక్కడ కూడా యుద్ధం గురించి మాట్లాడారు.

Trump Claims: ఆపరేషన్ సిందూర్‌పై మరో సారి కామెంట్లు చేసిన ట్రంప్
Trump Claims

లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై సోమవారం వాడీవేడి చర్చ జరిగింది. భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగటంలో అమెరికా ప్రమేయం లేదని విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. అయితే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం తానే ఆపానని ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాడు. సోమవారం స్కాట్‌లాండ్‌లో పర్యటించిన ఆయన అక్కడ కూడా యుద్ధం గురించి మాట్లాడారు. యుద్ధం తానే ఆపానని చెప్పుకొచ్చారు.


ట్రంప్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘మేము చాలా దేశాల మధ్య యుద్ధం ఆపాము. నేను గనుక జోక్యం చేసుకోకపోతే.. ఆరు పెద్ద యుద్ధాలు జరిగేవి. భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఇంకా యుద్ధం కొనసాగుతూ ఉండేది. మేము ఆపిన యుద్ధాల్లో భారత్, పాకిస్తాన్‌ల యుద్ధం చాలా పెద్దది. ఎందుకంటే అవి రెండు న్యూక్లియర్ బాంబులు ఉన్న దేశాలు. నాకు ఇండియా, పాకిస్తాన్ దేశాల నాయకులు తెలుసు. వాళ్లు నాకు బాగా తెలుసు. వాళ్లు మాతో ట్రేడ్ డీల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.


మరో వైపు యుద్ధం గురించి కూడా మాట్లాడుతున్నారు. నాకు తమాషాగా అనిపించింది. వాళ్లకు ట్రేడ్ డీల్ కావాలి. అందుకే.. మళ్లీ యుద్ధం చేయడానికి చూస్తే ట్రేడ్ డీల్ చేసుకోనని తేల్చి చెప్పా. వాళ్లు గనుక యుద్ధం చేస్తే.. అది మిగిలిన దేశాలకు వ్యాపిస్తుంది. చివరకు బూడిద మిగిలుతుంది. మనందరికీ కూడా బూడిదే మిగులుతుంది. వాళ్లు యుద్ధంలో న్యూక్లియర్ బాంబులు వాడితే మనపై కూడా ఆ ప్రభావం పడుతుంది. అందుకే కొంచెం స్వార్థంగా ఆలోచించాము’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

గొప్ప మనసు.. కొడుకు పెళ్లి రోజే 11 పేద జంటలకు పెళ్లి చేసిన తండ్రి

క్యూట్ వీడియో.. ఏనుగు పిల్ల చేసిన పనికి అందరూ నవ్వేశారు..

Updated Date - Jul 28 , 2025 | 09:51 PM