వెన్నులో వణుకు పుట్టాల్సిందే.. ఒకే చోట 75 వేల పాములు
ABN , Publish Date - Apr 10 , 2025 | 07:17 AM
The Worlds Largest Snake Gathering: ఒకే చోట 75 వేల పాములు వచ్చి చేరనున్నాయి. అక్కడకు వచ్చే పాముల్ని చూడ్డానికి జనం పెద్ద సంఖ్యలో జనం వస్తారు. సాధారణంగా గార్టర్ జాతికి చెందిన పాములు మనుషులతో ఇతర జంతువులతో ఎంతో అన్యోన్యంగా ఉంటాయి.

నూటికి తొంభై శాతం మందికి పాములను చూస్తే హడల్. పాము కనిపించగానే వెన్నులో వణుకు పుడుతుంది. భయంతో బిక్క చచ్చిపోతారు. నిజం చెప్పాలంటే.. పాము కాటు వేసిన తర్వాత.. విషం వల్ల చనిపోయే వారి కంటే.. భయంతో చనిపోయే వారే ఎక్కువ. ఒక పామును చూస్తేనే ఇలా ఉంటే.. ఒకే చోట 75 వేల పాముల్ని చూస్తే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. బ్రహ్మానందం అన్నట్లు.. ఊహించడానికే భయంకరంగా ఉంది కదూ.. కెనడాలోని మనిటోబ అనే ప్రాంతంలో ఈ సంఘటన మరికొద్దిరోజుల్లో జరగబోతోంది. మనిటోబలోని నార్సిస్ పాముల గుహల్లోకి ఏకంగా 75 వేల పాములు వచ్చి ఉండనున్నాయి. ఆ పాములు అంత పెద్ద మొత్తంలో అక్కడికి వచ్చి చేరడానికి ఓ బలమైన కారణం ఉంది.
ఆ పాములు నివసించే ప్రదేశంలో ఉష్టోగ్రత దారుణంగా పడిపోతుంది. మైనస్ 45 డిగ్రీలకు ఉష్టోగ్రత పడిపోతుంది. అందుకే అవి ఆ గుహల్లోకి వెళ్లిపోతాయి. సున్నం రాయితో ఏర్పడ్డ ఆ గుహలు చాలా వెచ్చగా ఉంటాయి. గడ్డ కట్టే చలినుంచి తమను తాము రక్షించుకోవడానికి అవి గుహల్లోకి వెళ్లిపోతాయి. ఉష్టోగ్రతలు మామూలు స్థితికి వచ్చే వరకు లోపలే ఉండి.. ఆ తర్వాత తమకు నచ్చిన ప్రదేశానికి వెళ్లిపోతాయి. ఇక్కడ చలికాలం వచ్చిందంటే ఉష్టోగ్రతలు మైనస్ 30 డిగ్రీలకు పడిపోతాయి. దాదాపు 6 నెలల పాటు ఇదే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ రెడ్ సైడెడ్ గార్డర్ పాములు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. సాధారణంగా గార్టర్ జాతికి చెందిన పాములు మనుషులతో ఇతర జంతువులతో ఎంతో అన్యోన్యంగా ఉంటాయి.
అందుకే వాటిని పెంచుకుంటూ ఉంటారు. నార్సిస్ పాముల గుహలకు మిలియన్ సంవత్సరాల చరిత్ర ఉంది. 450 మిలియన్ ఏళ్ల క్రితం ఆ ప్రాంతం సముద్రపు నీటితో నిండి ఉండేది. చాలా రకాల సముద్ర జీవులు అక్కడ జీవించేవి. తర్వాతి కాలంలో కాల్షియం కార్బనేట్‌ను నీళ్లు పీల్చుకోవటం వల్ల గుహలు ఏర్పడ్డాయి. ఆ గుహలు కొన్ని మీటర్ల లోతు వరకు ఉన్నాయి. ఇక, ఈ పాములను చూడ్డానికి జనం కూడా అక్కడకు వెళతారు. ఏప్రిల్, మే నెలలో పెద్ద సంఖ్యలో జనం అక్కడ పర్యటిస్తూ ఉంటారు. అక్కడ పెద్ద సంఖ్యలో ఉండే రెడ్ సైడెడ్ స్నేక్స్‌కు విషం ఉండదు కాబట్టి.. పర్యాటకులు వాటిని పట్టుకుని ఆడుకుంటూ ఉంటారు.
ఇవి కూడా చదవండి:
కలికాలం.. ముగ్గురు పిల్లలను వదిలిపెట్టి.. ఇంటర్ స్టూడెంట్‌తో మూడో పెళ్లి