Share News

Sri Lanka Floods: భారీ వర్షాలు వరదలతో శ్రీలంక అతలాకుతలం

ABN , Publish Date - Nov 28 , 2025 | 01:02 PM

శ్రీలంకను భారీ వర్షాలు, వరదలు ఊపిరిసలపనివ్వడంలేదు. జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. పాఠశాలలు, కార్యాలయాలు మూసివేశారు. వరుస ప్రమాద హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఇప్పటి వరకూ 56 మంది ప్రాణాలు కోల్పోయారు.

Sri Lanka Floods: భారీ వర్షాలు వరదలతో  శ్రీలంక అతలాకుతలం
Sri Lanka Floods

ఇంటర్నెట్ డెస్క్: ద్వీపకల్ప దేశం శ్రీలంకను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. దేశంలో కుండపోత వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకూ 56 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూసివేశారు. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నిన్న (గురువారం) తీవ్రరూపం దాల్చాయి.


ఇప్పటివరకు 600కి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. 21 మంది జాడ తెలియడంలేదు. బదుల్లా, నువర ఎలియా ప్రాంతాల్లో 25 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతాలు కొలంబో నుంచి 300 కి.మీ. దూరంలో టీ గార్డెన్‌లకు ప్రసిద్ధి చెందిన పర్వతాల్లో ఉన్నాయి.


తూర్పు అంపరా పట్టణంలో వరదలతో కారు కొట్టుకుపోవడంతో మరో ముగ్గురు మరణించారు. మొత్తం 14 మంది గాయపడ్డారు. నదులు, కాలువలు నిండిపోవడంతో రోడ్లు, రైలు ట్రాక్‌లపైకి మట్టి, చెట్టు పేరుకుపోయాయి.


ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటోంది. ప్యాసింజర్ రైళ్లను పూర్తిగా ఆపేశారు. పలు రోడ్లు మూసివేశారు. రక్షణ బలగాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్‌లు ఇళ్ల పైకప్పులపై చిక్కుకున్న ముగ్గురిని రక్షించాయి.


నేవీ, పోలీసులు బోట్లతో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు. ఈ విపత్తు శ్రీలంక ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా టీ ప్లాంటేషన్ ప్రాంతాల్లో. ప్రభుత్వం రిలీఫ్ కార్యక్రమాలు, రక్షణ చర్యలు ముమ్మరం చేసింది.


భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో, వరుస ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భారీ వర్షాలు, వరదలు శ్రీలంక ప్రజల జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజకీయ నినాదాలు కాదు.. వివక్షకు ఆధారాలు చూపాల్సిందే

ముఖ్యమంత్రా.. రియల్‌ ఎస్టేట్‌ ఏజెంటా..?

Read Latest Telangana News and National News

Updated Date - Nov 28 , 2025 | 01:47 PM