Share News

South Korea Invites: దక్షిణ కొరియా పిలుస్తోంది

ABN , Publish Date - Apr 14 , 2025 | 03:31 AM

ఉన్నత విద్య, అనుభవం కలిగిన టెక్ నిపుణులకు దక్షిణ కొరియా టాప్ టైర్ వీసాతో శాశ్వత నివాసం సహా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. హైటెక్ కంపెనీల్లో పని చేయాలని ఆకాంక్షించే వారికి ఇది గొప్ప అవకాశం

South Korea Invites: దక్షిణ కొరియా పిలుస్తోంది

  • టెక్‌ నిపుణులకు ‘టాప్‌ టైర్‌ వీసా’తో కొరియా స్వాగతం

  • ఉన్నత చదువు, అనుభవం ఉంటే గొప్ప అవకాశాలు

  • మూడేళ్ల తర్వాత శాశ్వత నివాసానికీ అవకాశం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 13: ఇటీవలి కాలంలో పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తున్న దేశాల్లో దక్షిణ కొరియా కూడా ఒకటి. ఆ దేశ సాంస్కృతిక వారసత్వం, ప్రకృతి అందాలు, రుచికరమైన వంటకాలు, ఉర్రూతలూగించే కొరియన్‌ మ్యూజిక్‌.. ఇలాటింవెన్నో పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. దీంతో చాలామంది భారతీయులు సెలవుల్లో ఎంజాయ్‌ చేయడానికి దక్షిణ కొరియాలో వాలిపోతున్నారు. పర్యాటకంగా ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్న దక్షిణ కొరియా తాజాగా తమ దేశంలో స్థిరపడాలనుకునే వారికి కూడా మంచి అవకాశాలు కల్పిస్తోంది. ‘మీ వద్ద అద్భుతమైన నైపుణ్యం ఉంటే.. మా దేశానికి రండి.. ఇక్కడే పనిచేసుకుంటూ కోట్లు సంపాదించుకోండి.. కావాలనుకుంటే ఇక్కడే స్థిరపడండి..’ అంటూ సాదర స్వాగతం పలుకుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 2వ తేదీన ‘టాప్‌ టైర్‌’ వీసా వ్యవస్థను ప్రారంభించిన కొరియా.. భారతీయులతో సహా వివిధ దేశాలకు చెందిన నిపుణులకు తమ దేశంలోని హైటెక్‌ కంపెనీల్లో పనిచేసుకునేందుకు, ఇక్కడే ఎక్కువకాలం నివాసం ఉండేందుకు మార్గం సుగమం చేసింది.


నూతన ఆవిష్కరణలకు తోడ్పడే సీనియర్‌ ఇంజనీర్లకు, వారి కుటుంబాలకు దీర్ఘకాలిక రెసిడెన్స్‌ పర్మిట్‌కు అవకాశం కల్పించే ఎఫ్‌-2 వీసాను అందిస్తోంది. ‘‘ప్రపంచ టాప్‌-100 విశ్వవిద్యాలయాల్లో ఏదో ఒకదానిలో మాస్టర్స్‌ లేదా పీహెచ్‌డీ చేసినవారు. టాప్‌ గ్లోబల్‌ కంపెనీల్లో కనీసం ఎనిమిదేళ్లు పనిచేసిన అనుభవం ఉన్నవారు’’ ఈ ఎఫ్‌-2 వీసాలకు అర్హులు. దరఖాస్తుదారులు కనీసం రూ.88.6 లక్షల వార్షిక వేతనాన్ని అందుకుంటూ ఉండాలి. రూ.1.2 కోట్ల వార్షిక వేతనం అందుకునేవారికి విద్య, పని అనుభవం వంటి అర్హతల్లో సడలింపు ఉంటుంది. ఈ ఏడాది మార్చిలో రూపొందించిన ప్రణాళికలో గ్లోబల్‌ టెక్‌ సంస్థల నుంచి కనీసం 1000 మంది సీనియర్‌ ఇంజనీర్లను తీసుకోవాలని నిర్ణయించినట్టు దక్షిణ కొరియా అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ

AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..

TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు

For International News And Telugu News

Updated Date - Apr 14 , 2025 | 03:31 AM