Self Inflicted: బ్యాంకాక్‌లో కాల్పులు.. ఆరుగురి మృతి
ABN , Publish Date - Jul 29 , 2025 | 04:37 AM
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓర్ టోర్ కోర్ మార్కెట్లో సోమవారం ఓ

బ్యాంకాక్, జూలై 28: థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓర్ టోర్ కోర్ మార్కెట్లో సోమవారం ఓ గుర్తుతెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకుని చనిపోయాడు. ఈ ఘటనలో దుండగుడితో పాటు మొత్తం ఆరుగురు మరణించినట్లు పోలీసులు తెలిపారు. వారిలో నలుగురు సెక్యూరిటీ గార్డులు, ఒక మహిళ ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం థాయ్‌లాండ్ - కంబోడియా సరిహద్దుల్లో ఏర్పడ్డ ఘర్షణలకు ఈ కాల్పులకు సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్
పహల్గాం దాడికి అమిత్‌షా బాధ్యత తీసుకోవాలి: గౌరవ్ గొగోయ్
For More National News and Telugu News..