Share News

Operation Sindoor: పాక్‌కు షాకిచ్చిన కొలంబియా.. భారత్‌కు సంఘీభావం

ABN , Publish Date - May 31 , 2025 | 05:33 PM

శిశిథరూర్ బృందం తమ పర్యటనలో భాగంగా కొలంబియా విదేశాంగ ఉప మంత్రి రోసా యెలాండ్‌ విల్లావెసెన్సియోతో భేటీ అయింది. పహల్గాం ఉగ్రదాడి, భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వివరాలను సమగ్రంగా తెలియజేసింది.

Operation Sindoor: పాక్‌కు షాకిచ్చిన కొలంబియా.. భారత్‌కు సంఘీభావం

బొగోటా: ఉగ్రవాదంపై పాక్ వైఖరిని ఎండగడుతూ కొలంబియాలో పర్యటిస్తున్న భారత పార్లమెంటరీ అఖిలపక్ష ప్రతినిధి బృందం దౌత్యం ఫలించింది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడిలో మరణించిన వారికి సంతాపం తెలిపిన కొలంబియా ప్రభుత్వం తాజాగా యూటర్న్ తీసుకుంది. పాక్‌కు తెలియజేసిన సంతాప ప్రకటనను వెనక్కి తీసుకుంది. దీనిపై కొలంబియా టీమ్‌కు సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ నేత శశిథరూర్ (Shashi Tharoor) సంతోషం వ్యక్తం చేసింది. అప్పట్లో పాక్‌కు సంతాపం తెలుపుతూ కొలంబియా చేసిన ప్రకటనపై శశిథరూర్ అసహనం వ్యక్తం చేశారు.


శిశిథరూర్ బృందం తమ పర్యటనలో భాగంగా కొలంబియా విదేశాంగ ఉప మంత్రి రోసా యెలాండ్‌ విల్లావెసెన్సియోతో భేటీ అయింది. పహల్గాం ఉగ్రదాడి, భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వివరాలను సమగ్రంగా తెలియజేసింది. దీంతో పరిస్థితులపై తమకు పూర్తి అవగాహన వచ్చినట్టు యెలాండ్ ప్రకటించారు. పాక్‌పై చేసిన ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు. కొలంబియా నిర్ణయంపై గన్ క్లబ్‌లో జరిగిన ది కొలంబియా కౌన్సిల్ ఆన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, సెలెక్ట్ పొలిటికల్ అనాలసిస్ట్ అండ్ డిప్లొమేట్స్‌‌ సమావేశంలో శశిథరూర్ కృతజ్ఞతలు తెలిపారు.


'విదేశాంగ మంత్రిత్వ శాఖతో తమ సమావేశానంతరం విదేశాంగ శాఖ ఉప మంత్రి చేసిన ప్రకటనపై సంతోషం వ్యక్తం చేస్తున్నాం. కశ్మీర్‌లో జరిగిన సంఘటన, ఉగ్రస్థావరాలపై దాడులకు దారితీసిన పరిస్థితులపై తమకు అవగాహన వచ్చిందని, గతంలో చేసిన ప్రకటనను ఉపసంహరించుకుంటున్నామని మంత్రి ప్రకటించారు' అని శశిథరూర్ తెలిపారు. భారత సార్వభౌమాధికారం, ప్రపంచ శాంతి, భారత ఉపఖండంలో శాంతికి భారత్ దృఢ నిశ్చయంతో ఉందని, ఇందుకు బాటసటగా ఉండేందుకు కొలంబియా తీసుకున్న నిర్ణయం చాలా సంతోషం కలిగించిందని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

జాతీయ వీరత్వానికి చిహ్నంగా సింధూరం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

పాకిస్థాన్‌పై ఘర్షణల్లో ఫైటర్ జెట్లను కోల్పోయాం.. సీడీఎస్ వెల్లడి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 31 , 2025 | 05:42 PM