Share News

PM Modi: మారిషస్ అధ్యక్షుడు, ఆయన సతీమణికి మోదీ గిఫ్ట్‌లు

ABN , Publish Date - Mar 11 , 2025 | 06:32 PM

మారిషస్ జాతీయ దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు మోదీ మారిషస్ వచ్చారు. ఇందులో భాగంగా దేశాధ్యక్షుడు ధరమ్ గోకుల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు, ఆయన సతీమణికి అరుదైన బహుమతులను మోదీ అందజేశారు.

PM Modi: మారిషస్ అధ్యక్షుడు, ఆయన సతీమణికి మోదీ గిఫ్ట్‌లు

పోర్ట్ లూయిస్: రెండు రోజుల అధికారిక పర్యటన కోసం మంగళవారం ఉదయం మారిషస్ (Mauritius) చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి అక్కడి ప్రవాస భారీతీయులు ఘన స్వాగతం పలికారు. మారిషస్ జాతీయ దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు మోదీ మారిషస్ వచ్చారు. ఇందులో భాగంగా దేశాధ్యక్షుడు ధరమ్ గోకుల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు, ఆయన సతీమణికి అరుదైన బహుమతులను మోదీ అందజేశారు. ప్రయాగ్‌రాజ్ ఇటీవల ముగిసిన మహా కుంభమేళా నుంచి తీసుకువెళ్లిన పవిత్ర గంగాజలాన్ని ధరమ్ గోకుల్‌కు అందించారు. వారణాసి నుంచి తీసుకువచ్చిన ప్రత్యేక బనారస్ చీరను హస్తకళాకారులు అందంగా తీర్చిదిద్దిన ఒక పెట్టెలో ఉంచి ధరమ్ గోకుల్ సతీమణి బృందా గోకుల్‌కు బహుకరించారు.

PM Modi: మారిషస్‌ చేరుకున్న ప్రధాని మోదీ.. రెండు రోజులు కూడా..


modi1.jpg

దీనికి ముందు, మారిషస్ ప్రధాని నవీన్ రామ్‌గోలంతో మోదీ సమావేశమయ్యారు. ఆ దేశ జాతిపిత సీవోసాగర్ రామగోలం పేరుమీదుగా ఏర్పాటు చేసిన బొటానికల్ గార్డెన్‌ను సందర్శించారు. ఉభయనేతలు మొక్కలు నాటారు. మిత్రుడు నవీన్‌తో 'ఏడ్ పేడ్ మా కే నామ్' కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని మోదీ ట్వీట్ చేశారు. 27 ఏళ్ల క్రితమే మారిషస్‌తో తనకు అనుభవం ఉందని, ఆ దేశానికి వచ్చినప్పుడల్లా మినీ ఇండియాకు వచ్చినట్టే ఉంటుందని చెప్పారు. చివరిసారిగా ప్రధాని హోదాలో 2015లో మారిషన్ నేషనల్ డేలో మోదీ పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి

Pakistan: రైలు హైజాక్.. బందీలుగా వందలాది ప్రయాణికులు

USA Deports Pak Diplomat: పాక్‌కు ఊహించని షాక్.. దౌత్యవేత్తకు అమెరికాలోకి అనుమతి నిరాకరణ

Read Latest and International News

Updated Date - Mar 11 , 2025 | 06:37 PM