Share News

Pakistan Crisis: పాకిస్తాన్‌లో హిట్లర్ తరహా దమనకాండ : ఇమ్రాన్ ఖాన్ సోదరి తీవ్ర ఆరోపణలు

ABN , Publish Date - Nov 28 , 2025 | 06:51 AM

పాకిస్తాన్లోని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం మీద ఇమ్రాన్ ఖాన్ సోదరి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్లో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ సమాజం దృష్టి పెట్టాలని ఆమె కోరారు. పాకిస్తాన్‌లో ఈ దుస్థితి ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేమని, ప్రజల ఆగ్రహం ఎప్పుడైనా..

Pakistan Crisis: పాకిస్తాన్‌లో  హిట్లర్ తరహా దమనకాండ : ఇమ్రాన్ ఖాన్ సోదరి తీవ్ర ఆరోపణలు
Imran Khan Sister Allegations

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్తాన్ దేశ చరిత్రలో అత్యంత చీకటి కాలాన్ని ఇప్పుడు ఎదుర్కొంటోందని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ సోదరి నూరీన్ నియాజీ తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్తాన్లో ప్రస్తుతం 'హిట్లర్ యుగం'నాటి దమనకాండ జరుగుతోందని ఆమె చెప్పారు. దేశంలో పౌరులు.. కిడ్నాప్‌లు, హత్యలు, జైలు శిక్షలు అనే అన్యాయాలకు గురవుతున్నారని, ఇది ఒక దుర్మార్గపు పాలన అని ఆమె అన్నారు.


తాను పెషావర్‌లో కలిసిన ఒక యువకుడి ఉదంతం గురించి నూరీన్ వివరించారు. 'గతేడాది నవంబర్ 26న తలపై కాల్చడం వల్ల అతను పక్షవాతం బారిన పడ్డాడు. అతని శరీరం పూర్తిగా దెబ్బతింది. ఇలాంటి కేసులు దేశంలో లెక్కలేనన్ని ఉన్నాయి' అని ఆమె చెప్పారు. 'మేము చరిత్రలో హిట్లర్ యుగం గురించి చదివేవాళ్లం, కానీ ఇప్పుడు మేము దాన్ని అనుభవిస్తున్నాం. ప్రజలను చిత్రవధ చేసి బలవంతం చేస్తున్నారు.' అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.


పంజాబ్ పోలీసులు.. పిల్లలు, వృద్ధులు, ఆడవాళ్లు ఇలా.. ఎవరైనా కొట్టడానికి ఆమోదం తెచ్చుకున్నారని, దీనిని ఎవరూ ప్రశ్నించరని నూరీన్ విమర్శించారు. ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం చరిత్రలో అత్యంత అప్రజాదరణకు గురైన ప్రభుత్వమని ఆమె అన్నారు. పాకిస్తాన్ సైన్యాధినేత జనరల్ ఆసిమ్ మునీర్‌ను 'డిక్టేటర్'గా ఆమె చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోయినా అక్రమార్గంలో అధికారంలోకి వచ్చిందని, విదేశీ శక్తుల మద్దతుతోనే కొనసాగుతోందని ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజకీయ నినాదాలు కాదు.. వివక్షకు ఆధారాలు చూపాల్సిందే

ముఖ్యమంత్రా.. రియల్‌ ఎస్టేట్‌ ఏజెంటా..?

Read Latest Telangana News and National News

Updated Date - Nov 28 , 2025 | 06:54 AM