Share News

Myanmar Other Earthquake: మయన్మార్‌ను వదలని భూకంపాలు.. రెండు రోజుల్లో 2 సార్లు

ABN , Publish Date - Mar 30 , 2025 | 02:19 PM

మయన్మార్‌ను వరుస భూకంపాలు వదలడం లేదు. 48 గంటల వ్యవధిలో మరోసారి మయన్మార్‌లో భూమి కంపించింది. ఇప్పటికే శుక్రవారం నాటి భూకంప ధాటికి చిగురుటాకులా వణుకుతున్న మయన్మార్ జనాలను మరో భూకంపం మరింత భయపెట్టింది.

Myanmar Other Earthquake: మయన్మార్‌ను వదలని భూకంపాలు.. రెండు రోజుల్లో 2 సార్లు
Myanmar Earthquake

మయన్మార్‌ను భూకంపాలు వదలడం లేదు. రెండు రోజుల వ్యవధిలో 2 సార్లు భూమి కంపించింది. శుక్రవారం నాడు సంభవించిన భూకంప ధాటి నుంచి జనాలు ఇంకా కోలుకోలేదు.. సహాయక చర్యలు కొనసాగతున్న సమయంలోనే.. నేడు ఆదివారం మధ్యాహ్నం.. మరోసారి మయన్మార్‌లో భూమి కంపించింది. దాంతో జనాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైంది. ఇక రెండు రోజుల క్రితం అనగా శుక్రవారం నాడు మయన్మార్‌లో 7.7 మ్యాగ్నిట్యుడ్‌తో సంభవించిన భూకంపం తీవ్ర నష్టం వాటిల్లింది.


వందల కొద్ద భవనాలు నెలమట్టం అయ్యాయి. శిథిలాల కింద చిక్కుకుని ఎందరో ప్రాణాలు కోల్పోయారు.. మరేందరో తీవ్రంగా గాయపడ్డారు. తక్షణమే స్పందించిన ప్రభుత్వం రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించింది. శుక్రవారం నాడు సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 1,644 కు చేరకుంది. 3,408 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. పలువురు గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఇదిలా ఉండగానే ఆదివారం నాడు మరోసారి మయన్మార్‌లో భూమి కంపించడంతో జనాలు మరింత భయపడుతున్నారు.


మయన్మార్‌ ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు ఆలస్యం అవుతున్నాయి. భూ ప్రకంపలన తీవ్రతకు పెద్ద పెద్ద భవనాలు కుప్పకూలాయి.. రోడ్లు ధ్వంసం అయ్యాయి. కరెంట్, టెలిఫోన్, ఇతర మౌలిక సౌకర్యాలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. దాంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. ఇక పర్వత ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని.. అక్కడ ఇంకా సహాయక చర్యలు మొదలు కాలేదని సమాచారం. సహాయక చర్యలు ఆలస్యం కావడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.


భూకంపంతో మయన్మార్‌లో నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చాయి. కరెంటు కోతల నేపథ్యంలో కొవ్వొత్తులకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. ఫలితంగా రూ.250గా ఉండాల్సిన 10 క్యాండిల్స్ ప్యాకెట్‌ ధర రూ.450కి పెరిగింది. విద్యుత్తు కొరత కారణంగా.. రోజుకు నాలుగు గంటలు మాత్రమే కరెంట్ సరఫరా చేయనున్నట్లు యాంగూన్‌ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్‌ ప్రకటించింది. ఆహారపదార్థాల ధరలకు కూడా రెక్కలొచ్చాయి. ఇక భూప్రకోపంతో విలవిలలాడిన మయన్మార్‌, థాయ్‌లాండ్‌కు సాయమందించేందుకు అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి. భారత్‌ ఏకంగా ‘ఆపరేషన్‌ బ్రహ్మ’ పేరుతో ఆపన్నహస్తం అందిస్తోంది.

ఇవి కూడా చదవండి:

మయన్మార్‌లో హాహాకారాలు

ఫోన్‌ను చొక్కా జేబులో పెడుతున్నారా.. ఎలా కొట్టేశాడో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

Updated Date - Mar 30 , 2025 | 02:24 PM