Share News

France: 11 ఏళ్ల బాలికపై నరరూప రాక్షసుడి ఉన్మాదం

ABN , Publish Date - Feb 17 , 2025 | 10:06 PM

వీడియో గేమ్‌లో ఓడినందుకు తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తి తనకు ముఖం పరిచయం కూడా లేని ఓ బాలికను బలితీసుకున్నాడు. ఫ్రాన్స్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.

France: 11 ఏళ్ల బాలికపై నరరూప రాక్షసుడి ఉన్మాదం

ఇంటర్నెట్ డెస్క్: ఫ్రాన్స్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వీడియోగేమ్‌లో ఓడిపోయినందుకు రెచ్చిపోయిన ఓ యువకుడు స్కూలు నుంచి ఇంటికొస్తున్న 11 ఏళ్ల బాలికను హత్యచేశాడు. నిందితుడిని ఓవెన్ ఎల్‌ గా గుర్తించారు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, నిందితుడు తొలుత వీడియో గేమ్‌లో ఓడిపోయాడు. ఈ క్రమంలో మరో గేమర్‌ అతడిని అవమానించాడు. దీంతో, అతడికి కోపం నషాళానికి అంటడంతో ఆవేశంగా ఇంట్లోంచి బయటకు వచ్చాడు.

Donald Trump: ఉద్యోగ యంత్రాంగంలో ఊచకోతలే!


ఈ క్రమంలో ఓ బాలిక అతడికి ఎదురుపడింది. కోపం తీరేందుకు నిందితుడు ఆమె వద్ద ఉన్న డబ్బును చోరీ చేద్దామనుకున్నాడు. ఈ క్రమంలో మెడలో సెల్‌ఫోన్ వేసుకుని ఆమె కనిపించింది. దీంతో, తానో వస్తువు పోగొట్టుకున్నానంటూ ఆమెకు మాయమాటలు చెప్పి సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ బాలికను కత్తితో బెదిరించి ఆమె వద్ద ఉన్న డబ్బును దోచుకునే ప్రయత్నం చేశాడు. కత్తిని చూడగానే భయపడిపోయిన బాలిక పెద్ద ఎత్తున ఆక్రందనలు చేసింది. దీంతో, చుట్టుపక్కల వారు అలర్ట్ అవుతారన్న ఆందోళనలో నిందితుడు బాలిక తల పట్టి గట్టిగా నేలపైకి తోశాడు. దీంతో, బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. మరో బాలికను కూడా ఇలాగే దోచుకుందామని ప్రయత్నించినా కుదరలేదు.


Mali : మాలిలో బంగారం గని కూలి 42 మంది మృతి

మరోవైపు, బాధితురాలు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కంగారుపడ్డ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యలు ప్రారంభించిన పోలీసులు బాలిక మృతదేహం పొదల్లో కనిపించింది. ఆమెపై లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు ఏవీ పోలీసులకు కనిపించలేదు. ఆ తరువాత కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తే నిందితుడి బాగోతం బయటపడింది.

హత్య అనంతరం ఇంటికొచ్చిన నిందితుడు తన గర్ల్ ఫ్రెండ్‌తో దారుణం చేశానని కూడా అన్నాడట. ఈ విషయాన్ని ఆమె అప్పుడే పోలీసులకు చెప్పకపోవడంతో వారు ఆమెపై కూడా కేసు నమోదు చేశారు. ఇక నిందితుడి గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. 2023లో అతడి సోదరి కూడా ఓ సందర్భంలో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మరిన్ని అంతర్జాతీయ కథనాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 17 , 2025 | 10:19 PM