Share News

Strong Earthquake: బంగ్లాదేశ్‌లో భారీ భూ ప్రకంపనలు.. కోల్‌కతాలో కంపించిన భూమి..

ABN , Publish Date - Nov 21 , 2025 | 11:18 AM

బంగ్లాదేశ్‌లో శుక్రవారం ఉదయం భారీ భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో కోల్‌కతాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. జనం భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.

Strong Earthquake: బంగ్లాదేశ్‌లో భారీ భూ ప్రకంపనలు.. కోల్‌కతాలో కంపించిన భూమి..
Strong Earthquake

ఢాకా: పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో భారీ భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూప్రకంపనల తీవ్రత 5.2 మాగ్నిట్యూడ్‌గా నమోదు అయింది. ఈ రోజు (శుక్రవారం) ఉదయం 10 గంటల 8 నిమిషాల ప్రాంతంలో ఘోరాశల్ దగ్గర భూప్రకంపనలు సంభవించాయి. యునైటెడ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. నార్సింగ్డికి 14 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. ఇక, బంగ్లాదేశ్‌లో భూకంపం రావటంతో కోల్‌కతాతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది.


ఇళ్లలోని ఫ్యాన్లతో పాటు ఇతర వస్తువులు అటు, ఇటు ఊగాయి. దీంతో జనం భయపడిపోయారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పెద్ద సంఖ్యలో జనం వీధుల్లోకి వచ్చి చేరారు. అయితే, భూ ప్రకంపనల కారణంగా ఎవరైనా చనిపోయారా? లేక గాయాలు అయ్యాయా? అన్న దానిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. భూ ప్రకంపనలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియ రావాల్సి ఉంది.


వైరల్‌గా మారిన వీడియో..

బంగ్లాదేశ్‌లో భూ ప్రకంపనలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ వీడియోలో ఢాకాలోని బద్దా లింక్ రోడ్ ఏరియాలోని ప్రజలు పెద్ద సంఖ్యలో వీధిలోకి వచ్చి నిలబడ్డారు. పక్కన ఉన్న అపార్ట్‌మెంట్స్ స్వల్పంగా కంపిస్తూ ఉన్నాయి. జనం భయంభయంగా అటు, ఇటు చూస్తూ ఉన్నారు. కొంతమంది వాటిని వీడియో తీస్తూ ఉన్నారు.


ఇవి కూడా చదవండి

ఆ స్థానంపై ప్రయోగాలెందుకు?: ఆకాశ్ చోప్రా

సీఎంగారూ.. తులం బంగారం హామీ ఏమైందిసారూ..

Updated Date - Nov 21 , 2025 | 12:10 PM