Share News

Ryo Tatsuki: సునామీ వచ్చింది.. ఆమె జోస్యం ఫలించిందా..

ABN , Publish Date - Jul 30 , 2025 | 07:45 PM

రష్యా , జపాన్‌లోని పలు ప్రాంతాలను సునామీ కుదిపేసింది. జపాన్‌లో ఈ ఏడాది అది కూడా జులై మాసంలో సంభవించనుందంటూ గతంలో చెప్పిన జోస్యం నిజమైందంటున్నారు.

Ryo Tatsuki: సునామీ వచ్చింది.. ఆమె జోస్యం ఫలించిందా..
Tsunami in Japan

టోక్యో, జులై 30: రష్యా తీరంలో భూకంపం సంభవించింది. ఇది రిక్టార్ స్కేల్‌పై 8. 8గా నమోదయింది. ఆ కొద్దిసేపటికే రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంతోపాటు జపాన్‌‌లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఆ కొన్ని నిమిషాలకే రష్యా, జపాన్‌లను సునామీ తాకింది. అయితే జపాన్‌లో విపత్తు సంభవించనుందని.. అది కూడా 2025, జులై 05వ తేదీన అంటూ 1999లో జపనీస్ వంగ కళాకారిణి రియో టాట్సుకి జోస్యం చెప్పారు. ఆ జోస్యం ప్రస్తుతం నిజమైందంటూ సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే ఊపందుకుంది.


టాట్సుకి మాంగా ది ప్యూచర్ ఐ సా ప్రకారం.. 2025, జులై 5వ తేదీన దక్షిణ జపాన్‌లో పెద్ద విపత్తు సంభవించనుందని తెలిపింది. ఆమె చెప్పినట్లు జులై 5వ తేదీన కాకున్నా.. కొద్ది రోజుల తర్వాత అంటే.. 20 రోజుల తేడాతో ఈ విపత్తు చోటు చేసుకుందని అంటున్నారు. ఆమె అంచనా కరెక్ట్ అయిందంటూ #July5Disaster హ్యాష్ ట్యాగ్‌లతో ప్రచారం జోరందుకుంది.


మరోవైపు రియో టాట్సు జోస్యం బలంగా నమ్మే జపానీయులు.. జూన్ మాసం నుంచి జులై ప్రారంభం మధ్య వరకు తమ తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. దీంతో ఆ యా రోజుల్లో విమాన ప్రయాణాలు గణనీయంగా తగ్గాయని అది కూడా ఎంతంటే.. 83 శాతం మేర తగ్గాయని గణాంకాలు సైతం వెల్లడిస్తున్నాయి.


ఇక సోషల్ మీడియాలో రియో టాట్సు జోస్యంతో జరుగుతున్న ప్రచారంపై టోక్యో యూనివర్సిటీ ప్రొఫెసర్లు స్పందించారు. సునామీలు ఎప్పుడు వస్తాయనే విషయాన్ని ఎవరూ చెప్ప లేరని పేర్కొన్నారు. అలాగే జపాన్ ఉన్నతాధికారులు సైతం టాట్సు అంచనాలను పరిగణలోకి తీసుకో వద్దంటూ ప్రజలకు సూచించారు. అవి పూర్తి నిరాధారమైనవని వారు అభివర్ణించారు.

అంతేకాకుండా వీటికి ఎటువంటి శాస్రీయ ఆధారం లేదని కుండ బద్దలు కొట్టారు. బల్గేరియాకు చెందిన బాబా వంగా భవిష్యత్తుపై అంచనాలు వేయడంలో ప్రఖ్యాతి గాంచారు. దీంతో జపాన్‌కు చెందిన రియో టాట్సుకిని చాలా మంది న్యూ బాబా వంగా అని, జపనీస్ బాబా వంగా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్

ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..

For More International News And Telugu News

Updated Date - Jul 30 , 2025 | 09:31 PM