Share News

Hostage Digs Own Grave: ఎముకల గూడులా శరీరం.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఎవ్యతార్ వీడియో

ABN , Publish Date - Aug 03 , 2025 | 03:33 PM

Hostage Digs Own Grave: వ్యతార్ డేవిడ్ అనే 24 ఏళ్ల ఇజ్రాయెల్ పౌరుడికి సంబంధించిన వీడియోను హమాస్ గ్రూపు విడుదల చేసింది. ఆ వీడియోలో ఎవ్యతార్ బాగా బక్కచిక్కిపోయి ఉన్నాడు. చూడ్డానికి ఎముకల గూడులా కనిపిస్తూ ఉన్నాడు.

Hostage Digs Own Grave: ఎముకల గూడులా శరీరం.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఎవ్యతార్ వీడియో
Hostage Digs Own Grave

పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం అమాయక ప్రజల ప్రాణాలతో ఆడుకుంటోంది. ఇజ్రాయెల్‌పై దాడుల సందర్భంగా హమాస్ గ్రూపు కొంతమంది ఇజ్రాయెల్ ప్రజల్ని బంధీలుగా తీసుకెళ్లిపోయింది. వారికి సరైన తిండి, నీళ్లు ఇవ్వకుండా గొడ్డుల్లా పని చేయించుకుంటోంది. తాజాగా, ఎవ్యతార్ డేవిడ్ అనే 24 ఏళ్ల ఇజ్రాయెల్ పౌరుడికి సంబంధించిన వీడియోను హమాస్ గ్రూపు విడుదల చేసింది. ఆ వీడియోలో ఎవ్యతార్ బాగా బక్కచిక్కిపోయి ఉన్నాడు. చూడ్డానికి ఎముకల గూడులా కనిపిస్తూ ఉన్నాడు.


హమాస్ గ్రూపు అతడితో గొడ్డు చాకిరి చేయించుకుంటోంది. ప్రస్తుతం అతడు అండర్ గ్రౌండ్ టన్నెల్‌లో పని చేస్తున్నాడు. హమాస్ గ్రూపు సభ్యులు అతడి వీడియో తీసి సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో విడుదల చేసిన 48 గంటల్లోనే ఎవ్యతార్‌కు చెందిన మరో వీడియోను హమాస్ గ్రూపు విడుదల చేసింది. ఆ వీడియోలో ఎవ్యతార్ మాట్లాడుతూ..‘నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే.. నా గొయ్యి నేనే తవ్వుకుంటున్నాను. రోజు రోజుకు నా శరీరం చాలా బలహీనంగా తయారు అవుతోంది’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.


ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ వీడియోపై ఎవ్యతార్ కుటుంబసభ్యులు స్పందించారు. అతడి తల్లి మాట్లాడుతూ.. ‘కావాలనే తిండిపెట్టకుండా నా కొడుకును హింసిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రజల్ని భయపెట్టడానికి అలా చేస్తున్నారు. ప్రపంచం చూస్తున్న భయంకరమైన చర్యల్లో ఇది కూడా ఒకటి. హమాస్‌లకు ప్రచారం కావాలనే నా కొడుకును తిండిపెట్టకుండా మాడుస్తున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక, ఈ వీడియోపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.


ఇవి కూడా చదవండి

మురికి నీళ్లలో పడిపోయిన కూతురు.. తండ్రి చేసిన పనికి అందరూ షాక్..

అరటిపండు తొక్క అందానికి నిధి.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..

Updated Date - Aug 03 , 2025 | 05:06 PM