Iran Nuclear Talks With US: ఇరాన్ ఊహించని నిర్ణయం.. ఇజ్రాయెల్‌కు గడ్డు కాలమే..
ABN , Publish Date - Jul 13 , 2025 | 01:09 PM
Iran Nuclear Talks With US: 12 రోజుల యుద్ధం తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. రెండు దేశాలు యుద్ధాన్ని ఆపేశాయి. అయితే, తాజా పరిణామంతో ఇజ్రాయెల్‌కు గట్టి దెబ్బ పడేలా ఉంది.

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య న్యూక్లియర్ పరిశోధనల విషయంలో యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఇరాన్ న్యూక్లియర్ బాంబు ప్రయోగాలు చేయటాన్ని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఇరాన్ న్యూక్లియర్ సైట్లను ధ్వంసం చేయడానికి ప్రయత్నించింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగింది. దాదాపు 12 రోజుల పాటు యుద్ధం నడిచింది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అమెరికా పూర్తి మద్దతు ఇచ్చింది. స్వయంగా రంగంలోకి దిగి బాంబర్లతో ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై దాడులు చేసింది.
12 రోజుల యుద్ధం తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. రెండు దేశాలు యుద్ధాన్ని ఆపేశాయి. అయితే, తాజా పరిణామంతో ఇజ్రాయెల్‌కు గట్టి దెబ్బ పడేలా ఉంది. ఇరాన్.. అమెరికాతో పాత దోస్తీ కొనసాగించాలని చూస్తోంది. ఇరాన్ న్యూక్లియర్ ప్రయోగాలు మొదలుపెట్టడానికి కారణం అమెరికానే. 1960లలో ఇరాన్.. అమెరికా సాయంతో న్యూక్లియర్ ప్రయోగాలు మొదలెట్టింది. అమెరికా ఇందుకోసం స్వయంగా కొన్నేళ్ల పాటు యురేనియాన్ని సప్లై చేసింది.
అయితే, ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఒకప్పుడు ఇరాన్ అణు ప్రయోగాలకు సాయం చేసిన అమెరికా ఇప్పుడు వ్యతిరేకిస్తోంది. యుద్ధం సమయంలో న్యూక్లియర్ సైట్లపై దాడులు కూడా చేసింది. ఇలాంటి సమయంలో బలవంతుడితో తలపడ్డం కంటే.. పక్కన చేరటం ఉత్తమమని ఇరాన్ భావిస్తోంది. అమెరికాతో అణు ఒప్పందం మళ్లీ కొనసాగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి అన్నారు. అమెరికా ఇకపై తమపై దాడులు చేయనని మాటిస్తేనే అణు ఒప్పందం చేసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
హనీమూన్ మర్డర్ కేసు.. ఇద్దరికి బెయిల్ ఇచ్చిన కోర్టు..
భార్యతో విడాకులు.. సంతోషంతో పాలతో స్నానం..